ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలి
పెద్దపల్లి రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల్లో పఠనం, గణిత సామర్థ్యాలు పెంచాలని సూచించారు. పాఠశాలలను సందర్శించినప్పుడు బోధన ప్రక్రియలో కొన్ని లోటుపాట్లు గమనించడం జరిగిందన్నారు. జిల్లాలోని 1,075 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు డీఆర్పీల ద్వారా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. బోధన విధానంలో ఉన్న లోపాలను సవరించుకుని పాఠశాలలోని 80 శాతం పిల్లల్లో పఠన, గణిత సామర్థ్యాలు పెంచినట్లయితే జిల్లాస్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డీఈవో డి.మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త ిపీఎంషేక్ పాల్గొన్నారు.
పకడ్బందీగా సర్వే నిర్వహణ
పెద్దపల్లిలోని అమర్‌నగర్ చౌరస్తా సమీపంలోని 35వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్‌లకు సహకరించాలని సూచించారు. ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యుమరేటర్‌లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్లు రూపొందించాలని అధికారులకు తెలిపారు. ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు రావడానికి వీలులేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు కృషి చేయాలి
కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Comments
Please login to add a commentAdd a comment