ఏసుక్రీస్తు బోధనలు అనుసరించాలి
మంథని: ఏసుక్రీస్తు బోధనలు క్రైస్తవులు అందరూ అనుసరించాలని ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ అన్నారు. పట్టణ శివారులోని శ్రీరాంనగర్ సి యోను ప్రార్థన మందిరంలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. తొలుత కేట్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. పొరుగువారిని ప్రేమించడం, ఆప్యాయత పంచడం లాంటి క్రీస్తు బోధనలు అనుసరించాలని కోరా రు. ఆజ్మీరా దయారాజ్, దూడ మహేశ్, మంథని మార్క్, గద్దల రాజేశ్, జోసెఫ్, మంథని ప్రసాద్, చింతకుంట్ల ప్రేమ్‌కుమార్, అందె రమేశ్, ఈర్ల సదానందం, రామగిరి కుమార్, కామని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment