రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
● ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్
కోల్‌సిటీ(రామగుండం): ప్రజాసమస్యల పరిష్కా రం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేదిశగా చేపట్టాల్సిన అంశాలపై గోదావరిఖనిలో స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు సోమవారం ప్రత్యేక స మావేశం నిర్వహించారు. స్థానిక శ్రీనగర్‌కాలనీలో నిర్వహించిన ఈ సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షుడు మంచికట్ల దయాకర్ మాట్లాడారు. నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో అభివృద్ధి కుంటుపడిందని, పేదల కోసం ఏర్పాటు చేసిన బాడీ ఫ్రీజర్లకు మరమ్మతు చేయడం లేదన్నారు. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించా రు. సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయలేదని తెలి పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్థానిక నిరుద్యోగులు దస్తావేజుల కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాని కోరారు. పేదలకు కొత్త రేషన్ కార్డులివ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అమాయకులను మోసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని, జీజీహెచ్ సూపరింటెండెంట్‌తోపాటు సిమ్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరారు. 32వ డివిజన్ కార్పొరేటర్ ఐత శివకుమార్, ప్రతినిధులు గోలివాడ చంద్రకళ, మద్దెల దినేశ్, నసీమ, రమేశ్, సుద్దాల అనురాజ్, కొమ్మ చందు యాదవ్, శంషేర్, అరవింద్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment