పశువుల పాలైన కార్మికుల బెల్లం
కోల్సిటీ(రామగుండం): కంపుకొడుతున్న చెత్తను తొలగించి.. రోడ్లను శుభ్రం చేస్తూ దుమ్ము, ధూళిని పీల్చే పారిశుధ్య కార్మికులు అనారోగ్యం బారిన ప డొద్దనే సంకల్పంతో అధికార యంత్రాంగం క్రమంతప్పకుండా బెల్లం పంపిణీ చేస్తూఉంటుంది. కానీ రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కార్మికులకు బెల్లం ఇవ్వకుండా వృథా చేస్తున్నారు. మంగళవారం సుమారు 600 కిలోల బెల్లాన్ని ఏకంగా పశువులపాలు చేయడం విమర్శలకు దారితీసింది. ఐదు నెలల క్రితం ఓ కాంట్రాక్టర్ ద్వారా అధికారు లు బెల్లం తెప్పించారు. అది నాసిరకంగా ఉందని, కరిగిపోయి తినడానికి కూడా పనికిరాకుండా దు ర్వాసన వస్తోందని ఇటీవల కార్మికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు బెల్లా న్ని కార్మికులకు పంపిణీ చేయకుండా మూలన పడే శారు. రోజురోజుకూ బెల్లం మురిగిపోయి దుర్వాసన వ్యాపిస్తుండడంతో గత్యంతరం లేక మంగళవారం నగరంలోని గోశాలలకు ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల్లో తీసుకెళ్లి పశువులకు ఆహారంగా వేశారు. దీనిపై బల్దియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment