కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్‌షిప్ జ్యోతిభవన్‌లో ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. 2018లో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, త్వరలో గేట్‌పాస్‌లు ఇచ్చేందుకు విధివిధానాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రాజక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, భూమల్ల చందర్, భూమయ్య, వెంగల బాపు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
పనులపై ఎంపీ ఆరా
రామగుండం: అమృత్ భారత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులపై మంగళవారం ఎంపీ వంశీకృష్ణ క్షేత్ర పర్యటన చేశారు. పనులు ప్రారంభించి ఏడాదిన్నర పూర్తవుతున్న పనులు నత్తనడకన కొనసాగుతుండటంపై సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతో చర్చించారు. మార్చిలోగా పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ఎంపీకి వివరించారు.
సైన్స్‌పై అభిరుచి పెంచుకోవాలి
మంథని: సైన్స్‌పై విద్యార్థులు అభిరుచి పెంచుకోవాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. మంగళవారం మంథని మండలం ఎక్లాస్‌పూర్ జెడ్పీ పాఠశాలలో సీతారామ సేవాసదన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు నారాయణతో కలిసి సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, సీతారామ సేవాసదన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి గణపతి, ఎంఈవో డి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
వాహన డ్రైవర్లు
బాధ్యతగా వ్యవహరించాలి
గోదావరిఖనిటౌన్: వాహన డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి రంగారావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆర్టీసీ డిపో సమీపంలో వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాలను అతివేగంగా నడుపొద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పక పాటించాలని, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి కళాకారుల సాంస్కృతిక బృందం దయానర్సింగ్ ఆధ్వర్యంలో పాటలు పాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రామగుండం ఎంవీఐ సంతోష్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్, ముగ్గురు ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టిజన్ల పేరిట అన్యాయం
పెద్దపల్లిరూరల్: విద్యుత్ శాఖలో పనిచేసే ఉ ద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి ఆర్టిజన్ పేరుతో పాలకులు అన్యాయం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి అన్నారు. పెద్దపల్లిలోని ట్రా న్స్‌కో ఎస్‌ఈ ఆఫీస్ వద్ద రెండురోజులుగా సంఘం జిల్లా అధ్యక్షుడు వాగునాయక్, నర్సయ్య ల ఆధ్వర్యంలో చేస్తున్న ఆర్టిజన్ల దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించి సంఘీభావం తెలి పారు. అంతకుముందు బీఆర్‌ఎస్ నాయకురా లు దాసరి ఉష, సీపీఎం జిల్లా కార్యదర్శి సదా నందం శిబిరాన్ని సందర్శించి ఆర్టిజన్లకు న్యా యం చేయాలన్నారు నాయకులు దుర్గం మల్లే శ్, భిక్షపతి, సుంకరి సదానందం, కిషన్‌రెడ్డి, రాజు, విశ్వనాథ్, దేవేందర్, శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment