సాగు వివరాలు
● జలవనరులపై పర్యవేక్షణ కరువు ● 22 ఏళ్లుగా నీటిసంఘాలు లేవు ● జిల్లాలో 550 చెరువులు ● ఎగువ, మధ్యమానేరు జలాశయాలు
● సిరిసిల్ల నియోజకవర్గం : 1,33,551 ఎకరాలు
● వేములవాడ నియోజకవర్గం : 1,55,866 ఎకరాలు
● మొత్తం : 2,89,417 ఎకరాలు
● చెరువుల కింద సాగు : 58,762 ఎకరాలు
● ఎస్సారెస్పీ : 6,481 ఎకరాలు
● 9వ ప్యాకేజీ సాగు : 64,200 ఎకరాలు
● 11వ ప్యాకేజీ సాగు : 22,511 ఎకరాలు
● ఎగువమానేరు ప్రాజెక్ట్ : 13,085 ఎకరాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): జలవనరుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా నీటిసంఘాలకు ఎన్నికలు లేవు. ఫలితంగా పాలకవర్గాలు లేక చెరువులు, ఆయకట్టు కాల్వ ల నిర్వహణ, మరమ్మతుపై ఎవరికీ పట్టింపు లేదు.
రెండు దశాబ్దాల క్రితం..
2002, 2004లో నీటి సంఘాలకు ఎన్నికలు జరుగగా, ఇప్పటి వరకు నీటి సంఘాల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలో 550 చెరువులు, కుంటలు, నర్మాల వద్ద ఎగువమానేరు, బోయినపల్లి మండలంలో మధ్యమానేరు, ఇల్లంతకుంట మండలం అనంతారం వద్ద అన్నపూర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్ననీటి వనరులు సింగసముద్రం, మూలవాగుపై నిమ్మపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. 500లోపు ఎకరాలకు సాగునీరందించే చెరువులు 15 వరకు ఉన్నాయి. ఎగువ మానేరు ప్రాజెక్టులో 8 మంది నీటి సంఘాల చైర్మన్లను గతంలో ఎన్నుకున్నారు. జిల్లాలో 1.50లక్షల మంది రైతులు ఉన్నారు. పట్టాదారు పాస్‌బుక్కులు ఉన్న వారికి గతంలో ఓటుహక్కు కల్పించారు.
నీటి సంఘాల విధులు ఇవీ..
● చెరువులు, కుంటల నిర్వహణ బాధ్యతలు.
● సంఘాల చైర్మన్లు, నీటిపారుదలశాఖ అధికారుల సమన్వయంతో సాగునీటిని అందించే పనులను రెగ్యులర్‌గా చేపడతారు.
● చెరువులు, కాలువల మరమ్మతు పనులు పర్యవేక్షిస్తారు.
● నీటి లీకేజీలు, కాల్వలకు పడ్డ బుంగలు పూడ్చడం, నీటిచౌర్యం నివారిస్తారు.
● నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తారు.
జలకళతో కళకళలాడుతున్న ఇది ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దచెరువు. 2016లో భారీ వర్షాలకు గండిపడింది. అప్పటి మంత్రి కేటీఆర్ రూ.6కోట్లతో చెరువును బాగుచేయించగా, కాళేశ్వరం నీటితో, ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఆరేళ్లుగా జలకళను సంతరించుకుంది. పెద్ద చెరువు కింద 450 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు ఎడమ షట్టర్ తూము లీకేజీ అవుతోంది. నీరంతా వృథాగా పోతోంది. చెరువు కింద కాలువలు అన్యాక్రాంతమయ్యాయి. చెరువులో పూర్తి సామర్థ్యంతో నీరు ఉన్నా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించే స్థితిలో లేదు. లీకై న నీరు కింద ఉన్న కుంటలో చేరుతోంది. అందులో ఊరి మురుగునీరు కలిసి కలుషితమవుతోంది. నీటి సంఘాల బాధ్యులుంటే ఆయకట్టు తైబంధీ తీర్మానించి కాల్వలను బాగుచేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment