వేములవాడ: కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఎములాడకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 25 వేల మంది రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కు చెల్లించడంతోపాటు అనుబంధ దేవాలయాలను దర్శించుకున్నారు.
రాజన్న సేవలో విప్‌లు, ఎస్పీ
రాజన్నను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. నాయకులు శ్రీనివాస్, తిరుపతిరావు, శ్రవణ్ తదితరులున్నారు. రాజన్న ను ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్ దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో కొప్పుల వినో ద్‌రెడ్డి వారికి స్వామి వారి ప్రసాదాలు అందించి, సత్కరించారు. ఏఈవో శ్రవణ్, అర్చకులున్నారు.
అర్చకుల అంతర్గత బదిలీలు?
వేములవాడ రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల అర్చకుల అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు సమాచారం.
కోడెమొక్కు చెల్లించుకుంటున్న
ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment