సిరిసిల్లకల్చరల్: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయ అధికారి డీఎస్ వెంకన్న గురువారం ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ అయిన సీట్ల కోసం కూడా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో జరిగిన స్వల్ప మార్పులు గమనించాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా విద్యార్థులకు సంబంధించిన స్టడీ, ఆధార్, కులం, ఆదాయ సర్టిఫికెట్ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment