లైసెన్స్ ఉంటేనే బైక్ నడపాలి
● మైనర్ డ్రైవింగ్‌పై నిర్లక్ష్యం వద్దు ● పట్టుబడితే కఠిన చర్యలు ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే వాహనాలు నడపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో లైసెన్స్ కోసం జిల్లా వ్యాప్తంగా 700 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 మందికి లైసెన్స్‌లు ఇప్పించామని, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల్లో దశలవారీగా అందజేస్తామని తెలిపారు. స్థానిక ఆర్టీఏ ఆఫీస్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి డ్రైవింగ్‌లైసెన్స్‌లు అందించి మాట్లాడారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే ప్రమాదబీమా వర్తించదని తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు కృష్ణ, శ్రీనివాస్, డీటీవో లక్ష్మణ్, వంశీధర్, రజనీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment