టీమిండియా చారిత్రక విజయం
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ని భారత్ విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా (5/30), సిరాజ్ (2/20), హర్షిత్ రాణా (3/48) కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. రాహుల్ 77, పడిక్కల్ 25, పంత్ 1, జురెల్ 1, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.
534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలో మూడు.. సుందర్ రెండు.. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
చారిత్రక విజయానికి మరో వికెట్ కావాలి..!
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించేందుకు మరో వికెట్ కావాలి. 227 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో నాథన్ లయోన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఓటమి అంచుల్లో ఆస్ట్రేలియా
227 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (12) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపుకు మరో రెండు వికెట్లు కావాలి.
ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్
182 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ బౌలింగ్‌లో మార్ష్ (47) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ అవుట్
161 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (89) ఔటయ్యాడు. మిచెల్ మార్ష్‌కు (31) జతగా అలెక్స్ క్యారీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 373 పరుగులు చేయాలి.
లంచ్ విరామం సమయానికి సగం వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 104 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (63), మిచెల్ మార్ష్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో గెలవాలంటే మరో 430 పరుగులు చేయాలి.
79 పరుగులతో సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్
534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్ (17) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రవిస్ హెడ్ (45) జతగా మిచ్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఉస్మాన్ ఖ్వాజా (4) ఔటయ్యాడు. ట్రవిస్ హెడ్ (13), స్టీవ్ స్మిత్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ స్కోర్ 37/4గా ఉంది.
నాలుగో రోజు ప్రారంభమైన ఆట
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.
భారత్: 150 & 487/6
ఆస్ట్రేలియా: 104 & 12/3
Comments
Please login to add a commentAdd a comment