IND VS AUS 1st Test Day 3 Live Updates: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మూడో రోజు ఆద్యంతం టీమిండియా ఆధిపత్యమే కొనసాగింది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ(161), విరాట్ కోహ్లి శతకం(100 నాటౌట్), కేఎల్ రాహుల్(77) సూపర్ హాఫ్ సెంచరీ(77)లతో పాటు.. నితీశ్ రెడ్డి (38 నాటౌట్) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 134.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ రెండు, స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ మెక్‌స్వీనీ(0) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కమిన్స్(2)ను సిరాజ్ వెనక్కి పంపాడు. బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ (3) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ మెక్‌స్వీనీని బుమ్రా డకౌట్‌గా వెనక్కిపంపాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కమిన్స్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో తొమ్మిది పరుగులకే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది
భారత ఇన్నింగ్స్ డిక్లేర్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. సెకెండ్ ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి 534 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు భారత్ ఉంచింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(161), విరాట్ కోహ్లి(100 నాటౌట్) సూపర్ సెంచరీలతో చెలరేగారు.
ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా
321 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో ధృవ్ జురెల్ (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 367 పరుగుల లీడ్‌లో ఉంది. విరాట్‌కు జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. పంత్ ఔట్
320 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ (1) స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 366 పరుగుల లీడ్‌లో ఉంది. విరాట్‌కు (16) జతగా ధృవ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
161 పరుగుల వద్ద ఔటైన జైస్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జస్వాల్ 161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తద్వారా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 161 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టడంతో జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. భారత్ స్కోర్ 313/3గా ఉంది. విరాట్‌కు (16) జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 360 పరుగులుగా ఉంది.
150 పరుగులు పూర్తి చేసుకున్న జైస్వాల్
యశస్వి జైస్వాల్ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. యశస్వి తన టెస్ట్ కెరీర్‌లో చేసిన నాలుగు సెంచరీల్లో 150 పరుగులు దాటాడు. యశస్వి స్కోర్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 88 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 288/2గా ఉంది. యశస్వికి జతగా విరాట్ కోహ్లి (4) క్రీజ్‌లో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
275 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ (25) ఔటయ్యాడు. 85 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 275/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (141), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు.
భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్‌లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్‌దత్ పడిక్కల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్‌కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
201 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌కు (102) జతగా దేవ్‌దత్ పడిక్కల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్
ఓపెనర్ యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వి సెంచరీలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ 74 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 62 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 197/0గా ఉంది.
మూడో రోజు మొదలైన ఆట
భారత, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోర్ 172/0 వద్ద భారత్ మూడో రోజు ఆట ప్రారంభించింది. కేఎల్ రాహుల్ (62), యశస్వి జైస్వాల్ (90) క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాథన్ మెక్‌స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment