క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్ర ఆటగాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తమ డెబ్యూ క్యాప్‌లు అందుకున్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మరో కీలక మార్పు కూడా చేసింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్‌ను ఆడిస్తారని అంతా అనుకున్నారు.
అయితే మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తాడు. అలాగే వన్‌డౌన్‌లో దేవ్‌దత్ పడిక్కల్ బరిలోకి దిగనున్నాడు. ధృవ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలో ఉంటాడు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీని డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు.
తుది జట్లు..
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment