3, 4 తేదీల్లో ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ పర్యటన
నెల్లూరు(అర్బన్): షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వన్‌మాన్ కమిషన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా జనవరి 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ ఏ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న వైఎస్సార్ జిల్లా నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి సాయంత్రం 6.30 గంటలకు నెల్లూరు చేరుకుంటారన్నారు. 4వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా యంత్రాంగంతో సమావేశమవుతారన్నారు. అనంతరం వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారన్నారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఇక్కడే బస చేస్తారన్నారు. 5వ తేదీ ఉదయం ఒంగోలుకు బయలుదేరి వెళుతారన్నారు.
రాయల్ కాప్స్ సంఘ జిల్లా
మహిళా అధ్యక్షురాలిగా శైలజ
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): కాపుల అభ్యున్నతికి దోహ దపడుతున్న రాయల్ కాప్స్ సంఘం జిల్లా మహి ళా అధ్యక్షురాలిగా నెల్లూరు కు చెందిన బాసి శెట్టి శైలజ నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాప్స్ దేవినాయుడు, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నరసింహులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కాపుల అభ్యున్నతికి తన శాయశక్తుల పని చేస్తానని, తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన వారందరికీ శైలజ కృతజ్ఞతలు తెలియజేశారు.
సహకార సంఘ బ్యాంక్
ఖాతాలకు ఈకేవైసీ తప్పనిసరి
నెల్లూరు (వీఆర్సీసెంటర్): జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంకు ఖాతా లకు తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని జిల్లా సహకారశాఖాధికారి (డీసీఓ) గుర్ర ప్ప అదేశించారు. నగరంలోని డీసీఓ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అన్ని రికార్డులు, సభ్యుల వివరాలు కంప్యూటరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మైబెల్ అప్లికేషన్ ద్వారా సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఈకేవైసీ చేయించాలన్నారు. రుణాలు, సేవలు అన్ని ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేయబడుతాయన్నారు. సహకార సంఘంలోని ప్రతి సభ్యుడు బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలని, సభ్యులకు సంబంధించిన రుణాలు, పథకాలు అన్ని ఆయా సహకార సంఘ బ్యాంకు అకౌంట్ ద్వారానే లభిస్తాయన్నారు. జిల్లాలో 67,231 మంది సంఘ సభ్యులు ఉండగా, 39,314 మంది సభ్యులు ఇప్పటి వరకు ఈకేవైసీ నమోదు చేసుకున్నారని, మిగిలిన సభ్యులు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు.
అగ్రిగోల్డ్ బాధితులకు
ప్రభుత్వం న్యాయం చేయాలి
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): రాష్ట్రంలోని అగ్రి గోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చే యాలని, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసి వారిపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధిత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పా రు. నగరంలోని సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా అగ్రి గోల్డ్ ఏజెంట్స్, బాధిత వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 మార్చిలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోపు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల క్రితం అగ్రిగోల్డ్ బాధితులు ఉద్యమాన్ని ప్రారంభించారని, అయినప్పటికీ ఇప్పటీకీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యా యం చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేనయాలని డిమాండ్ చేశారు. తిరుపతిరావు, అరిగెల నాగేంద్రసాయి, దామా అంకయ్య, రామ దాస్, శంకరయ్య, చంద్రశేఖర్ రావు, శివరామకృష్ణ, కృష్ణ, రామకృష్ణ, కోటయ్య, సుబ్రహ్మణ్యం, రవిచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment