వేణుగోపాలుని తెప్పోత్సవం
కమనీయం..
కోనేరులో తెప్పోత్సవం
ఉలవపాడు: ఉలవపాడులో కొలువైన రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి కనుల పండువగా జరిగింది. గ్రామ నడిబొడ్డున ఉన్న కోనేరులో కనుమ నాడు వేణుగోపాల స్వామి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు. తర్వాత కోనేరులో 11 చుట్లు తెప్పోత్సవం చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు తమ కోర్కెలు తీరాలని కోనేరులో దీపాలు వెలిగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment