కండలేరులో 56.040 టీఎంసీల నిల్వ
రాపూరు: కండలేరులో బుధవారం నాటికి 56.040 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
గుడ్లూరు: మండలంలోని చేవూరు చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనచోదకులు చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి గుడ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం, తెలుపు అడ్డగడుల టీషర్టు, నల్లని కాటన్ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఈ మేరకు ఎస్సై వెంకటరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment