హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు
జలదంకి: సంక్రాంతిని పురస్కరించుకుని జలదంకి మండలం బ్రాహ్మణక్రాక శివాలయం వద్ద మంగళవారం ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించారు. పోటీల్లో వైఎస్సార్ జిల్లా చౌటుపల్లికి చెందిన మార్తల చిన ఓబులరెడ్డి ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 4182 అడుగుల దూరం వరకు బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి సాధించాయి. అలాగే వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం గాజులపేటకు చెందిన పసుపులేటి రమణయ్య ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 3321 అడుగుల దూరం బండ లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.40 వేలు దక్కించుకున్నాయి. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు మండలం రంగసాయిపల్లికి చెందిన మార్తల వెంకట సుబ్బారెడ్డి ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 3300 అడుగుల దూరం బండ లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ.30 వేలు దక్కించుకున్నాయి. మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మూలె సురారెడ్డి ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 3139 అడుగుల దూరం బండ లాగి నాల్గవ స్ధానంలో, వేముల మండలం బెస్తవారిపల్లెకు చెందిన గండ్లపెంట జతిన్ విహాన్ ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 3018 అడుగుల దూరం బండ లాగి ఐదవ స్థానంలో నిలిచాయి. ఈ పోటీలను ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, దగుమాటి వెంకట కృష్ణారెడ్డిలు ప్రారంభించారు.
బహుమతుల ప్రదానం
ఎడ్ల బండలాగుడు పోటీల్లో మొదటి బహుమతి మొత్తాన్ని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అందించారు. రెండో బహుమతిని ఇందూరి శంకరలింగం బ్రదర్స్, మూడో బహుమతిని పెద్దిరెడ్డి బ్రదర్స్, నాల్గవ బహుమతిని పున్నం రోశిరెడ్డి, ఐదవ బహుమతిని వేలమూరి రాంమోహన్‌రెడ్డిలు సమకూర్చారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన వారికి నిర్వాహకులు అన్నదానం చేశారు. పోటీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలిగిరి సీఐ వెంకటనారాయణ, జలదంకి ఎస్సై లతీఫున్నీసా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వంటేరు నందగోపాల్‌రెడ్డి, పున్నం రోశిరెడ్డి, జిలుమూడి వినయ్‌కుమార్‌రెడ్డి, మేకల శ్రీనాథ్‌రెడ్డి, గాడేపల్లి మల్లికార్జున, జిలుమూడి వేణుగోపాల్‌రెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
విజేతగా వైఎస్సార్ జిల్లా ఎడ్లు
ఆసక్తిగా తిలకించిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment