నేడు ‘ఎన్టీఆర్ భరోసా’ పంపిణీ
పుట్టపర్తి అర్బన్: జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆదేశాలు అందినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,64,629 మంది పింఛన్ లబ్ధిదారులుండగా, ప్రభుత్వం రూ.114.46 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ పింఛన్ పంపిణీ ప్రారంభించేలా సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పింఛన్ తీసుకోలేని వారికి జనవరి 2వ తేదీ పింఛన్ ఇవ్వనున్నారు. నవంబర్‌లో 236 మంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు కొత్త పింఛన్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు గత రెండు నెలల్లో పింఛన్ తీసుకోని వారికీ నగదు అందజేస్తారన్నారు.
28వ తేదీలోపు
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
ప్రశాంతి నిలయం: జిల్లా పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ 2025 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్‌ను జనవరి 1 తేదీ నుంచి 28వ తేదీలోపు సమీపంలోని ఉప ఖజానా కార్యాలయంలో సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి నాగమల్లిక సూచించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మీ– సేవ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ సమర్పించవచ్చన్నారు. ఇందుకోసం ‘జీవన్ ప్రమాణ్ పోర్టల్’ను సందర్శించాలని సూచించారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయిపై భక్తి ప్రపత్తులను చాటుతూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిరుపురీ సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు కృతజ్ఞతా పూర్వక సంగీత కచేరీ నిర్వహించారు. గంట పాటు సాగిన కచేరీతో భక్తులు మైమరచిపోయారు. సత్యసాయి ప్రేమ, సేవా గుణాలను, ఆధ్యాత్మిక తత్వాన్ని కొనియాడుతూ చక్కటి భక్తిగీతాలు ఆలపించడంతో భక్తలు పరవశం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment