మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్యకై ంకర్యాలు విశేషంగా కొనసాగాయి. ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లను పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. తర్వాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, మధుఫర్క పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, నరసింహాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment