సాక్షి, ఖమ్మం: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీతో సంబంధాలు ఉన్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’మీడియాతో మాట్లాడుతూ.. మోదీతో సంబంధాల వల్లే కేంద్రాన్ని రేవంత్ రెడ్డి నిలదీయలేకపోతున్నారన్నారు.
బీజేపీతో మేము ములాఖత్ కాలేదు.. కాంగ్రెస్ పార్టీయే అయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మహబూబ్‌నగర్ లోక్‌సభ ఫలితం. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ముంపు కాలనీలలో ప్రజలకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓర్వలేక దాడులు చేస్తున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.
‘‘ముంపు కాలనీలో కాలనీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు పర్యటిస్తున్న సందర్భంలో బాధితులు ఎదురు తిరగడం అందరు చూస్తూనే ఉన్నారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment