పరవళ్లుతొక్కుతున్న తలకోన జలపాతం
భాకరాపేట: అల్పపీడనం ప్రభావంతో ఎర్రా వారిపాళెం మండలంలోని తలకోన జలపాతం పరవళ్లుతొక్కుతోంది. గురువారం ఉదయం నుంచి తలకోన జలపాతంలో భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో తలకోనకు వెళ్లే మార్గం వద్ద ఉన్న కలుజు దాటకుండా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు తలకోన జలపాతం మార్గం మూసివేశారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
తిరుపతి అర్బన్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మే రకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరు పతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్‌డీ కేంద్రాలకు శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ ఉత్తర్వులను సంబంధిత యా జమాన్యాలన్నీ విధిగా పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.
పటిష్ట భద్రతా చర్యలు
● అత్యవసర పరిస్థితుల్లో 112, 80999 99977 నంబర్లుకు సమాచారం
తిరుపతి క్రైం: జిల్లా వ్యాప్తంగా గురువారం కురుస్తున్న భారీ వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. డ్యామ్ లు, వంకలు, వాగులు, చెరువుల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రమా దపు హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. వంకలు, వాగులు, వద్ద ముంపు గురైన ప్రాంతాల్లో పోలీసులు పహారా పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తాజా సమాచారం తెలుసుకుని అవసరమైనప్పుడే ప్రయాణం చేయాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 112, 80999 99977 నంబర్లకు సమాచారం ఇస్తే పోలీసులు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని ప్రజలకు సూచించారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 65,887 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.88 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్‌లో వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను ముందుగా క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.
స్టార్టప్‌లతో అవకాశాలు
అందిపుచ్చుకోవాలి
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోసైన్స్, సెరికల్చర్, డీబీటీ బిల్డ ర్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో లైవ్ అగ్రి టెక్నాలజీ–స్టార్టప్ అవకాశాలు అనే అంశంపై జాతీయ వర్క్‌షాపు నిర్వహించారు. ప్రొఫెసర్ డీఎం మమత ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాపునకు సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ ఇన్వేస్టిగేటర్ డాక్టర్ సి.మధుమతి ముఖ్య అతిథిగా హాజరై స్టార్టప్ ఫండింగ్ ఏజెన్సీలు, వ్యవస్థాపక అవకాశాలు, ఉద్యానవన రంగంలో సమీకృత వ్యవసాయ నమూనాలపై పలు సూచనలు చేశారు. అనంతరం నంద్యాలకు చెందిన వ్యవసాయ పారి శ్రామికవేత్త రమేష్ తేనెటీగల పెంపకం ద్వారా వివిధ స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ వర్క్‌షాపులో ప్రొఫెసర్లు సుజాతమ్మ, సావిత్రి, విజయ కుమారి, సువర్ణలత, శాంతి, శోభారాణి, హేమావతి, హరిప్రియ, రేఖ, మహి ళా శాస్త్రవేత్త శ్వేత కుమారి, రీసెర్చ్ స్కాలర్లు, వివిధ విభాగాల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment