పునాది గట్టిగా ఉంటేనే అద్భుత ఫలితాలు
రామచంద్రాపురం: ప్రాథమిక తరగతుల్లో భాష, గణితం పరంగా పునాది బలంగా ఉంటే పిల్లలు అద్భుత ఫలితాలు సాధిస్తారని స్టేట్ అబ్జర్వర్ అపర్ణ తెలిపారు. మండలంలోని మెడ్‌జీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఆరు రోజులుగా ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ లీడర్‌షిప్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం అసిస్టెంట్ ఏఏంఓ మధు మాట్లాడారు.
లోక్ అదాలత్‌లో
1,933 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,933 కేసులు పరిష్కారమైనట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ తెలిపారు. పరిష్కానరమైన కేసులు 450 వరకు ఉన్నాయన్నారు. అలాగే తిరుపతి అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన జరిమానా చెల్లించే కేసులు 1,579 ఉన్నాయన్నారు. కేసుల పరిష్కారం కోసం తొమ్మిది బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. వాటికి అధ్యక్షులుగా తనతోపాటు తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి విజయసారథి రాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, జూనియర్ సివిల్ జడ్జీలు సత్యకాంత్ కుమార్, కోటేశ్వరరావు, సంధ్యారాణి, గ్రంధి శ్రీనివాస్, వై సరితాలు వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment