బంగారు తిరుచ్చిపై చిద్విలాసం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపుంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి అనుబంధంగా వెలసిన శ్రీకృష్ణ స్వామివారు, అమ్మవార్లతో కలసి శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం శ్రీరుక్మిణిసత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ మునిబాలకుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, జమేదారు జలందర్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
9 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,722 మంది స్వామివారిని దర్శించుకోగా.. 22,225 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 9 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
టీచర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లా, గూడూరులోని ఎస్పీఎస్ ప్రాథమికోన్నత ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు–1, లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) పోస్టు–1, లాంగ్వేజ్ పండిట్ (హిందీ) పోస్టు–1, డైరెక్ట్ నియామకం ద్వారా భర్తీ చేసేందుకు ఆ పాఠశాల కరస్పాండెంట్ నోటిఫికేషన్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. అర్హత ఉన్న అభ్యర్థులు శ్రీసీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్/ఎయిడెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్‌శ్రీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే పాఠశాల కరస్పాండెంట్‌కు నేరుగాను ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తులను అందజేయాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment