తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఎనర్జీ కన్జరేవేషన్ డేని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ కే.రంగనాథం హాజరై విద్యార్థులకు ఎనర్జీ కన్జర్వేషన్‌పై అవగాహన కల్పించారు. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ కన్సర్వేషన్ మధ్య తేడాను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచ, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ పీ.మల్లికార్జున, ప్రొఫె సర్ వీరారెడ్డి, కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment