ఇస్రో శాస్త్రవేత్తలకు బెంగళూరులో వర్క్‌షాపు
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రధానకేంద్రమైన బెంగళూరులో ఈనెల 11న భారత ఆటోమోటివ్ పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించినట్టు శనివారం ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, ఇన్‌స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇస్రో, ఇన్‌స్పేస్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించించారు. అలాగే రాకెట్ పరికరాలు, ఉపగ్రహాలకు చెందిన పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్స్ కూడా ఈ సెమినార్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. కెమె రా ఇమేజింగ్ సెన్సార్లు, ఉష్ణోగ్రత, పీడన సెన్సా ర్లు, అకౌస్టిక్, వైబ్రేషన్ సెన్సార్లు, గైరోస్కోప్‌లు, యాక్సిలరోమీటర్లు, ప్రత్యేకమైన పూతలు, అడ్హెసివ్‌లు, యాంటీ వైబ్రేషన్, నాయిస్ సప్రెషన్ టెక్నాలజీలు, ఇన్సు లేషన్ టెక్నాలజీలు, భద్రతా వ్యవస్థలపై కూలకషంగా సెమినార్‌లో చర్చించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ ‘భారత అంతరిక్ష కార్యక్రమం నుంచి జ్ఞానాన్ని బదిలీ చేయడం’ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రయివేట్ పార్టనర్లు పాల్గొన్నారు.
వర్క్‌షాఫ్ అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రయివేట్ పార్టనర్స్
Comments
Please login to add a commentAdd a comment