కదులుతున్న రైలు ఎక్కుతూ..
– గుర్తుతెలియని మహిళ మృతి
చిల్లకూరు: కదలుతున్న రైలు ఎక్కే క్రమంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన గూడూరు రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. హౌరా నుంచి బెంగళ్లూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరులో నిలిచింది. రైలులో నుంచి మంచి నీటి కోసం ప్లాట్‌ఫామ్ మీదకు దిగిన సుమారు 50 ఏళ్ల గుర్తుతెలియని మహిళ రైలు కదులుతుండడంతో వడివడిగా రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె పట్టతప్పి పడిపోయి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్
రామచంద్రాపురం: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఏపీఈఆర్‌సీ చైర్మన్ థాకూర్ రమాసింగ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని కుప్పంబాదూరు 33/11కెవీ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సమీప సబ్‌స్టేషన్లలో ఏదైనా సమస్య తలెత్తినా విద్యుత్ అందించే విధంగా యంత్రాలను ఆధునీకరణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సురేంద్రనాయుడు, డీఈ దేవఆశీర్వాదం, ఏఈ గిరి, ఏడీఈ శంకరయ్య, సబ్ ఇంజినీర్ దినేష్ చంద్రారెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తిరుపతి తుడా: ఢిల్లీ వేదికగా జనవరి 3వ తేదీ నుంచి జరగనున్న జాతీయ స్థాయి ఉద్యోగుల క్రీడాపోటీలకు తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే.శశిభూషణ్‌రావు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం ఢిల్లీ జాతీయ సివిల్ సర్వీస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు అధికారులు ఒక ప్రకటన విడదుల చేశారు. జాతీయ స్థాయిలో జరిగే బ్యాడ్మింటన్ సింగిల్ విభాగంలో ఆయన తలపడనున్నారు. ఉద్యోగులు ఆయనను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment