రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. నెల్లూరుకు చెందిన వినయ్(23), హేమలత(23) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. తిరుమల దర్శనార్థం శుక్రవారం బయలుదేరారు. శనివారం తిరిగి నెల్లూరుకు బైక్‌పై వెళుతుండగా శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద హేమలత బ్యాగు లారీకి చిక్కుకోవడంతో ఆమె లారీ కింద పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. వినయ్ స్వల్పగాయాలతో బయటపడడ్డాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment