క్యాన్సర్‌పై అప్రమత్తత అవసరం
తిరుపతి కల్చరల్ : క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, మరింత అప్రమత్తంగా ఉంటూ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తతో ఆరోగ్యా న్ని పరిరక్షించుకోవాలని టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఎండీ, నిపుణుడు డాక్టర్ పెనుమడు ప్రశాంత్ తెలిపారు. కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస, వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వాకర్స్‌కు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెనుమడు ప్రశాంత్ మాట్లాడుతూ.. దూమపానం, ఊబకాయం ఉన్న వారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా సీ్త్రలలో బ్రెస్ట్ క్యాన్సర్ అధికంగా ఉందని, వ్యాధి ముదరక ముందే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి చికిత్సతో నివారించవచ్చని తెలిపారు. అనంతరం పేదలు, వాకర్స్‌కు ఉచితంగా స్క్రీన్ టెస్టులు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ ఆఫ్ తిరుపతి శ్రీనివాస అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ , కార్యదర్శి జగన్నాథం, ఆకుల వెంకట రమణమూర్తి, వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలాజీ నాయుడు, కార్యదర్శి శివారెడ్డి, సాయి కృష్ణంరాజు, రామస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment