పంటలపై ఏనుగుల బీభత్సం
– భయాందోళనలో అన్నదాతలు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలంలోని పంట పొలాలపై గజరాజుల దాడులతో భారీగా పంట ధ్వంసం అయింది. శనివారం తెల్లవారు జామున ఏవూరు, భాకరాపేట పంచాయతీ పరిధిలోని అటవీ సరిహద్దుల్లో ఉన్న పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడులు చేసి టమాట, వరి, చెరకు, అరటి, మామిడి తోటలు ధ్వంసం చేశాయి. అలాగే పొలాలకు వేసిన ముళ్ల కంచె కూసాలను విరిచేశాయి. మూడు వారాల కిందట ఏనుగు మృతి చెందినప్పటి నుంచి గజరాజల గుంపు ఈ ప్రాంతం వదలి వెళ్లడం లేదు. దీంతో ఆ ప్రాంత రైతులు ఏనుగులతో వణికిపోతున్నారు. ఏనుగులు గుంపును అటవీ ప్రాంతం వైపు మళ్లించే చర్యలను తీసుకోవడంలో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment