తిరుపతి రూరల్: ఫోర్జరీ సంతకాలతో బిల్లులను దొడ్డిదారిలో డ్రా చేసిన ఎస్వీ జూ పార్క్ ఫీల్డ్ ఇంజినీర్ రవితేజపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు తెలిపారు. ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ నాగభూషణం ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. 2024 ఏప్రిల్, మేలో జూ ఇన్ క్యాంటీన్లో ఎలక్ట్రికల్ పనులు కాంట్రాక్టర్ హరినాథ్ పూర్తి చేసినట్లు తెలిపారు. అప్పట్లో జూ అసిస్టెంట్ క్యూరేటరుగా ఉన్న మాధవి ఆ పనులను ఆదేశించినప్పటికీ, ఆమె బదిలీ పై వెళ్లిన తర్వాత ఆమె పేరు మీద ఫోర్జరీ సంతకం చేసి బిల్లు క్యూరెటర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకం ద్వారా రూ.88,317ను కాంట్రాక్టర్ హరినాథ్‌కు ఫీల్డ్ ఇంజినీర్ రవితేజ మంజూరు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిల్లులను పరిశీలించిన ప్రస్తుత అసిస్టెంట్ క్యూరేటర్ జగదీష్ చంద్ర ప్రసాద్ గతంలో ఉన్న అధికారి మాధవి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. విచారణ లో నిర్ధారణ కావడంతో రవితేజను విధుల నుంచి తొలగించారు. ఫారెస్ట్ అసిస్టెంట్ కన్సర్వేటర్ నాగభూషణం ఫిర్యాదు మేరకు రవితేజ పై ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment