డాక్టర్ అభిజిత్ జైన్‌కు అవార్డు
తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యుడు అభిజిత్ జైన్‌కు బెస్ట్ వీడియో ఈ–పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డు దక్కింది. పాట్నా వేదికగా రెండు రోజుల క్రితం జరిగిన 34వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నేషనల్ కాన్ఫిరెన్స్‌లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రజెంటేషన్ అందించారు. దీంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్, విభాగాధిపతి డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వెంకటరామిరెడ్డి, ప్రొఫెసర్ చంద్రమౌళీశ్వరన్, అధ్యాపకులు ఆయనను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment