పరిశుభ్రంగా కలెక్టరేట్
తిరుపతి అర్బన్: మన ఇల్లు, మన పరిసరాలను శుభ్రం చేసుకున్నట్లే.. మన కలెక్టరేట్‌ను కూడా శుభ్రం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సిబ్బందికి సూచించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్ వద్ద శనివారం స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్‌లో భాగంగా ఉద్యోగులచేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెలా 3వ శనివారం కార్యాలయాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న సుమారు 150 మంది ఉద్యోగులు కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లోని పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యాలయంలోని ఫైల్స్, టేబుల్స్, ఇతర వస్తువులను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment