చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
శంకర్‌పల్లి: నిత్యం చిరు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, జీవనశైలిని పొందొచ్చని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ డా.ఖాదర్ వలీ అన్నారు. మండల పరిధిలోని దొంతాన్ పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వద్యాలయంలో సెంటర్ ఫర్ ఉమెన్ డెవలప్‌మెంట్ (సీడబ్ల్యూడీ), క్లబ్ ఐనా ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలా మంది బియ్యం, గోధుమలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారని, వీటితో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు స్పష్టం చేశారు. నిత్యం మనం తీసుకోనే ఆహారంలో క్రమం తప్పకుండా చిరు ధాన్యాలను చేర్చాలని సూచించారు. తద్వారా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. డయాబెటీస్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, యోగా థెరపిస్ట్ డా. పి.విజయ్‌కుమార్, వైస్ చాన్సలర్ డా.ఎల్.ఎస్ గణేశ్, రిజిస్ట్రార్ డా.ఎస్.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ డా.ఖాదర్ వలీ
Comments
Please login to add a commentAdd a comment