ఎంపీడీఓల సంఘ సమావేశం
దోమ: మండల పరిషత్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా దోమ మండల ఎంపీడీఓ మహేష్ బాబు ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘ ఎన్నిక కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడిగా మహేష్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా నవాబుపేట్ ఎంపీడీఓ అనురాధ, కోశాధికారిగా ధారూర్ ఎంపీడీఓ నర్సింలు, సభ్యులుగా వెంకన్న, విశ్వప్రసాద్, ఉషశ్రీ, శ్రీరాములు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా మహేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment