● కూటమి ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం ● టీడీపీ నాయకుడు అల్సా అప్పలనారాయణ | - | Sakshi
Sakshi News home page

● కూటమి ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం ● టీడీపీ నాయకుడు అల్సా అప్పలనారాయణ

Published Sun, Nov 24 2024 3:42 PM | Last Updated on Sun, Nov 24 2024 3:42 PM

● కూటమి ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం ● టీడీపీ నాయకుడు

● కూటమి ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం ● టీడీపీ నాయకుడు

విశాఖ యాదవులకు అన్యాయం

బీచ్‌రోడ్డు: యాదవ కార్పొరేషన్‌లో విశాఖ పార్లమెంట్‌ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం దారుణమని టీడీపీ నాయకుడు అల్సా అప్పలనారాయణ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ ఆడియో వైరల్‌గా మారింది. టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఎంతో మంది యాదవులు పార్టీకి అండగా ఉన్నారని, నాయకులు పార్టీలు మారినా.. కార్యకర్తలు మాత్రం టీడీపీతోనే ప్రయాణం సాగించారని అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక ఎంపీ భరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, గణబాబు, పల్లా శ్రీనివాస్‌లు యాదవుల పేర్లు ఎందుకు సిఫార్సు చేయాలేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సమావేశం నిర్వహించి.. కూటమి ప్రభుత్వానికి విశాఖ యాదవుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాగా.. సోషల్‌ మీడియా ద్వారా కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలను విమర్శించిన మరుసటి రోజే ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం సిరిపురం వద్ద ద్విచక్రవాహనంపై ఉన్న ఆయన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన ముఖంపై గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎవరో కావాలనే చేశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement