కూటమి మాటలు నమ్మి మోసపోయాం | - | Sakshi
Sakshi News home page

కూటమి మాటలు నమ్మి మోసపోయాం

Published Sat, Jan 4 2025 12:58 AM | Last Updated on Sat, Jan 4 2025 12:58 AM

కూటమి

కూటమి మాటలు నమ్మి మోసపోయాం

● వలంటీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీప్తి ● జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ధర్నా ● ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

సీతమ్మధార : ‘నమ్మించి మోసం చేశారు. కూటమి హామీలు నమ్మి వీధిన పడ్డాం. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు..మాట ఇస్తే నిలుపుకోవాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోకూడదు’ అంటూ వలంటీర్లు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే వార్డు వలంటీర్లకు రూ.10వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం మానేశారని ఏపీ ప్రజా గ్రామ, వార్డు వలంటీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా అధ్యక్షురాలు దీప్తి పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జీవీఎంసీ గాంధీ పార్కులో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు రాజీనామాలు చేశాక వీరి సంఖ్య 1.50వేల మంది మిగిలారని గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపుగా 14 వేల మంది వరకు వలంటీర్లు ఉన్నారని తెలిపారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గౌరవ వేతనం కింద రూ.5000 క్రమం తప్పకుండా ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదని, తమను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. మహిళలను గౌరవిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ..వలంటీర్లుగా 50 శాతం మంది మహిళలే పనిచేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.మణి మాట్లాడుతూ సావిత్రిభాయి ఫూలే స్ఫూర్తితో పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తున్నా వలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కే.ఎస్‌.వి.కుమార్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సీఎం డౌన్‌ ...డౌన్‌..డిప్యూటీ సీఎం డౌన్‌ డౌన్‌అంటూ పెద్ద ఎత్తున వలంటీర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెండో పట్టణ పోలీసులు, స్పెషల్‌బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శనివారం కూడా ధర్నా కొనసాగిస్తామని వలంటీర్లు పేర్కొన్నారు.

మాట నిలుపుకోవాలి

కూటమి అధికారంలోకి వస్తే వేతనాలు రూ.5వేల నుంచి రూ.10 వేలుకు పెంచుతామని హామీ ఇచ్చారు. రూ.10వేల సంగతి దేవుడెరుగు, అసలు ఉద్యోగం ఇస్తే అదే పదివేలు అన్నట్టుగా ఉంది. వలంటీర్లను కొనసాగించి, కూటమి నేతలు ఇచ్చిన మాట ప్రకారం రూ.10వేల వేతనాలు ఇవ్వాలి.

– లక్ష్మణ్‌, వార్డు వలంటీర్‌, గాజువాక.

ధర్నా చేస్తున్న వలంటీర్లు

చంద్రబాబు మోసం చేశారు

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలవుతున్నా వార్డు, గ్రామ వలంటీర్లను కొనసాగించకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. వేతనాలు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చలేదు. పండక్కి పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది.

– దీప్తి, విశాఖ జిల్లా అధ్యక్షురాలు

మహిళా వలంటీర్ల అవస్థలు

రాష్ట్రంలోని వలంటీర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. వీరిలో దివ్యాంగులు కూడా పనిచేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తున్నా వలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వలంటీర్లను విధుల్లోకి తీసుకుని, రూ. 10 వేలు వేతనాలు ఇవ్వాలి.

– లైలా , దివ్యాంగ వలంటీర్‌, పెందుర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి మాటలు నమ్మి మోసపోయాం1
1/3

కూటమి మాటలు నమ్మి మోసపోయాం

కూటమి మాటలు నమ్మి మోసపోయాం2
2/3

కూటమి మాటలు నమ్మి మోసపోయాం

కూటమి మాటలు నమ్మి మోసపోయాం3
3/3

కూటమి మాటలు నమ్మి మోసపోయాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement