అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
పాన్‌గల్: సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు పుష్పగుచ్ఛం అందజేయగా.. సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్‌లో రికార్డులు, లాకప్, రిసెప్షన్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూం పరిసరాలను పరిశీలించారు. ఠాణా పరిధిలో జరిగిన చోరీలు, నేరాలు, పాత నేరస్తుల వివరాలను సీఐ, ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, చట్టాలను సక్రమంగా అమలు చేయడం పోలీసుల బాధ్యతన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని, గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రధాన కూడళ్లు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. స్టేషన్‌లో ఇద్దరు సిబ్బందిని ఎంపిక చేసి వారు దొంగతనాలు, నేరాల గుర్తింపులో ప్రముఖ పాత్ర పోషించేలా సిద్ధం చేయాలన్నారు. కానిస్టేబుల్ వర్మ పనితీరును అభినందించి ఆయనకు రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.
గ్రామ పోలీసు అధికారులు సందర్శించాలి..
గ్రామ పోలీసు అధికారులు కేటాయించిన గ్రామాల్లో నిత్యం సందర్శిస్తూ ప్రజలకు చట్టాలు, నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని నేరాలు, దొంగతనాలు, ఘర్షణలు లేని ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దాలన్నారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారంలో ఎస్‌ఐ పనితీరు బాగుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment