సర్వే త్వరగా పూర్తి చేయాలి..
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తప్పులు లేకుండా త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శనివారం మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండాలో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 30 దరఖాస్తులను పరిశీలించాలని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాఘవా, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment