జిల్లాలో పోలీసు యాక్ట్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పోలీసు యాక్ట్‌ అమలు

Published Thu, Jan 2 2025 12:59 AM | Last Updated on Thu, Jan 2 2025 12:58 AM

జిల్ల

జిల్లాలో పోలీసు యాక్ట్‌ అమలు

ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా జనవరి 1 నుంచి 31 వరకు 30, 30 (ఎ) పోలీసు యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు

వనపర్తి టౌన్‌: హన్మకొండలో జేఎన్‌ఎస్‌ క్రీడా మైదానంలో కొనసాగుతున్న సీఎం కప్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా విద్యార్థి సాయికుమార్‌ అండర్‌–18 విభాగం 100 మీటర్ల పరుగు పందెంతో తృతీయ స్థానంలో నిలిచారు. అలాగే మురళీకృష్ణ అండర్‌–18 షాట్‌పుట్‌ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సురేందర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు రామచంద్రమ్మ, శారద, ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు.

రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తాం

అలంపూర్‌: డీసీసీబీ బ్యాంక్‌ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తామని డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. అలంపూర్‌ పీఏసీఎస్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. మూడు సొసైటీలు కలిపి రూ.50 కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్వహించిన సమావేశానికి విష్ణువర్ధన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేయడంతోపాటు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న డీసీసీబీ బ్యాంక్‌ ద్వారా ఈ ఏడాది రూ. 1550 కోట్ల లావాదేవీలు జరిపిందని, గతేడాది రూ. 1200 కోట్లు అని వివరించారు. ఆరు నెలల్లోనే రూ. 350 కోట్ల లావాదేవీలు పెరిగిందన్నారు. 2024 డిసెంబర్‌ నుంచి జనవరి వరకు మూడు సొసైటీలు కలిపి రూ. 50 కోట్ల లావాదేవీలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది ఈ మూడు సొసైటీలు రూ. 38 కోట్ల లావాదేవీలు చేయగా ఆరు నెలల్లోనే రూ.12 కోట్ల పెంచినట్లు తెలిపారు. అలంపూర్‌ డీసీసీబీ బ్యాంక్‌లో మరో మూడేళ్లలో రూ.100 కోట్ల వరకు లావాదేవీలు జరిగే విధంగా చూస్తామన్నారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులకు కర్శకమిత్ర ద్వారా రూ.10 లక్షలు, మార్టిగేజ్‌ లేకుండా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 25 లక్షలు, గ్రామాల పరిధిలో ఉన్న రైతులకు ఇంటి కోసం రూ.15 లక్షల వరకు రుణాలు ఇస్తుందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడైన చదువుకోవడానికి రైతు బిడ్డలకు రూ.10 లక్షలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ.35 లక్షల వరకు రుణ సౌకర్యం ఉందన్నారు. రైతులకు బంగారంపై 15 నిమిషాల్లో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.2 లక్షల రుణ మాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండటంతో రైతులకు సేవ చేసే అవకాశం లభించిందని, డీసీసీబీ బ్యాంక్‌ ఆర్‌బీఐ మార్గదర్శకాలతో, రైతు పక్షపాతిగా డీసీసీబీ పనిచేస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలుగా రుణాలు అందించేంది డీసీసీబీ బ్యాంక్‌ ఒక్కటే అని, సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ రంగారెడ్డి, డీసీసీబీ సీఈఓ పురుషోత్తం రావు, పీఏసీఎస్‌ అధ్యక్షులు మోహన్‌ రెడ్డి, గజేందర్‌ రెడ్డి, రాఘవ రెడ్డి, బ్యాంక్‌ మేనేజర్‌ రేణుకమ్మ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వివరాలు 8లో..

హోరాహోరీగా ‘నెట్‌బాల్‌’ పోటీలు

దూసుకెళ్తున్న మహబూబ్‌నగర్‌ జట్లు

ప్రీక్వార్టర్‌కు చేరిక

నేటితో ముగియనున్న పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలో  పోలీసు యాక్ట్‌ అమలు 
1
1/1

జిల్లాలో పోలీసు యాక్ట్‌ అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement