గతేడాది వానాకాలం సీజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పంప్‌హౌజ్ పరిధిలోని మోటారుతో పాటు బ్రేకర్, ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయాయి. దీంతో సుమారు రూ.10 లక్షలు వెచ్చించి కొత్తవి కొనుగోలు చేసి నీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఎకరా సాగుకు రూ.1,800 చొప్పున పంట కిస్తు వసూలు చేస్తూ లిఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న లష్కర్లు, ఆపరేటర్లు, అకౌంటెంట్, మెకానిక్‌ల నెలవారి వేతనాలు రూ.1.20 లక్షల పైచిలుకు చెల్లిస్తున్నారు. 24 ఏళ్లుగా రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులను బ్యాంకులో ఖాతా తెరిచి జమ చేయడంతో ప్రస్తుతం రూ.80 లక్షల ఎఫ్‌డీలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment