ఖిలా వరంగల్
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ శివనగర్ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీలలితాదేవి అమ్మవారికి రూ.11లక్షల కాయిన్స్‌తో అభిషేకం నిర్వహించారు. అనంతరం రూ.2లక్షల కరెన్సీ నోట్లతో శ్రీమహాలక్ష్మిగా అలంకరించారు. పూజారి వెంకటేశ్వరాచార్యులు ఆధ్వర్యాన ఆలయ అభివృద్ధి కమిటీ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచాల కృష్ణమూర్తి, రావికంటి అశోక్, శ్రీరాంరాజేశ్, ఆడెపు శ్యాంసుందర్, నవీన్, భక్తులు పాల్గొన్నారు.
– ఖిలా వరంగల్
మహాలక్ష్మిగా..
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ శ్రీభద్రకాళి అమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా అలంకరించారు. ఉత్సవమూర్తిని ఉదయం కూష్మాండ, సాయంత్రం గిరిజా క్రమాల్లో పూజించి సూర్యప్రభ, హంసవాహనాలపై ఊరేగించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజ య్య అమ్మవారిని దర్శించుకున్నారు. రుద్రేశ్వరాలయంలో శ్రీరుద్రేశ్వరీ అమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా, ఐనవోలులో భ్రమరాంబిక అమ్మవారిని కూష్మాండదుర్గగా అలంకరించారు.
– హన్మకొండ కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment