జిల్లాల వారీగా మండలాలు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరా
సాక్షిప్రతినిధి, వరంగల్ :
వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య విడుదల చేశారు. మొత్తం 24,905 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం 2025 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు పాత ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30న రద్దు చేసింది. ఉపాధ్యాయులు తిరిగి తమ ఓటుహక్కును అక్టోబర్ 1 నుంచి నమోదు చేసుకోవాలని. ఆన్‌లైన్ పద్ధతుల్లో ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మూడు నెలలుగా సాగిన ప్రక్రియ అనంతరం 24,905 మంది అర్హత గల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. కాగా ఎన్నికల సంఘం, ఏర్పాట్ల స్పీడును బట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
2019తో పోలిస్తే పెరిగిన ఓటర్లు...
2019 మార్చిలో జరిగిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మొత్తం 20,888 మంది ఓటర్లున్నారు. ఇందుకోసం 181 పోలింగ్ కేంద్రాలు అప్పుడు ఏ ర్పాటు చేశారు. 2025 మార్చిలో ఎ మ్మెల్సీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 30న పాత జాబితాను రద్దు చేసి కొత్తగా ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల న మోదు ప్రక్రియలో భాగంగా నవంబ ర్ 23న ప్రకటించిన ముసాయిదా జాబితా నాటికి 22,554 మంది ఓ టర్లు నమోదయ్యారు. ఆ తర్వాత కూడా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల గడువు పెంచగా.. డిసెంబర్ 30 (సో మవారం) నాటికి 24,905 మంది ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ముసాయిదా జాబితాకు ఫైనల్ జాబితాకు 2,351 మంది ఓటర్లు పెరగగా.. 2019 ఓటర్ల జాబితాతో పోలిస్తే 4,017 మంది ఉపాధ్యాయుల ఓట్లు పెరిగాయి.
పురుష ఓటర్లే ఎక్కువ...
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల్లో నమోదైన మొత్తం 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లలో అత్యధికంగా పురుషులే ఉన్నారు. 9,965 మంది సీ్త్ర ఓటర్లు నమోదు కాగా, పురుషులు 14,940 మంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ సారి 12 జిల్లాల్లోని 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్‌లోని ఓటర్లు 10,797...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 24,905 మంది ఓటర్లలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఆరు జిల్లాల నుంచి 6,509 మంది పురుషులు, 4,288 సీ్త్రల ఓ టర్లు కలిపి మొత్తం10,979 మంది ఉన్నారు. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 5,098 మంది ఓటర్లు నమోదు కాగా, తర్వాత వరంగల్‌లో 2,225, మహబూ బాబాద్‌లో 1,618, జనగామలో 921, ములుగులో 61 2, జేఎస్ భూపాలపల్లిలో 323 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు.
జిల్లాలు
12
మండలాలు
191
ప్రతిపాదిత
పోలింగ్ స్టేషన్లు
200
పురుష ఓటర్లు
14,940
సీ్త్ర ఓటర్లు
9,965
మొత్తం ఓటర్లు
24,905
వరంగల్ –ఖమ్మం– నల్లగొండ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా వెల్లడి
మూడు నెలల ప్రక్రియకు తెర
12 జిల్లాలు, 200 పోలింగ్
కేంద్రాలు
2025 ఫిబ్రవరి.. లేదా మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు?
జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం
కేంద్రాలు
సిద్దిపేట 04 04 120 43 163
జనగామ 12 12 556 365 921
హనుమకొండ 11 15 2,884 2,214 5,098
వరంగల్ 13 13 1,381 844 2,225
మహబూబాబాద్ 18 16 1,083 535 1,618
భూపాలపల్లి 07 07 211 11 323
ములుగు 09 09 394 218 612
భద్రాద్రి 23 23 1,038 941 1,949
ఖమ్మం 21 24 2,300 1,655 3,955
యాదాద్రి 17 17 595 326 921
సూర్యాపేట 23 23 1,690 947 2,637
నల్లగొండ 33 37 2,688 1,795 4,483
Comments
Please login to add a commentAdd a comment