ఫిబ్రవరి 21, 22న ఎస్‌ఆర్‌కేఆర్‌లో సింపోజియం
భీమవరం : భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్‌టీఈ) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో శ్రీనిపుణశ్రీ పేరిట జాతీయ స్థాయి విద్యార్థి సింపోజియం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు చెప్పారు. శనివారం కళాశాలలో సింపోజియం పోస్టర్‌ను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు, కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ఐఎస్‌టిఈ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎస్.రామ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సింపోజియంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. సింపోజియంలో అయిదు విభాగాలకు చెందిన 17 ఈవెంట్లు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment