అంతర పంటలపై ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

అంతర పంటలపై ఆసక్తి

Published Sun, Jan 19 2025 12:30 AM | Last Updated on Sun, Jan 19 2025 12:39 AM

అంతర

అంతర పంటలపై ఆసక్తి

చింతలపూడి: మెట్ట ప్రాంతంలో రైతులు అంతర పంటలపై మక్కువ చూపుతున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టితో ఒక పంటకు నష్టం వాటిల్లినా మరో పంట ఆదుకుంటుందన్న ఆశతో ఖర్చుకు వెనుకాడకుండా అంతర పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పెరుగుతున్న ఎరువులు, పురుగు మందులు ఖర్చు, సాగు పెట్టుబడులతో గిట్టుబాటు ధర లభించకపోవడంతో మరింత ఆదాయం కోసం వాణిజ్య పంటలతో పాటు అంతర పంటలపై మొగ్గు చూపుతున్నారు. మెట్ట ప్రాంతంలో 10 వేల హెక్టార్లలో రైతులు అంతర పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతర పంటల్లో భాగంగా కొబ్బరిలో కోకో, అరటి, వక్క, ఆయిల్‌పాం తోటల్లో వేరుశనగ, మొక్కజొన్న, మామిడిలో మొక్కజొన్న, ఏకకాలంలో రెండు, మూడు రకాల కూరగాయల సాగు చేస్తున్నారు. అంతర పంటల సాగు వల్ల వాణిజ్య పంటల సాగులో పెట్టుబడులను అంతర పంటల నుంచి రైతులు సమకూర్చుకుంటున్నారు. దీనివల్ల కూలీల కొరతను అధిగమించడమే కాకుండ ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు ఖర్చు తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే వీలు కలుగుతుందంటున్నారు. ప్రభుత్వాలు కూడ అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులకు ప్రత్యేక రాయితీలు, రుణాలు అందించి అంతర పంటల సాగు పెరగడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంతర పంటలపై ఆసక్తి 1
1/3

అంతర పంటలపై ఆసక్తి

అంతర పంటలపై ఆసక్తి 2
2/3

అంతర పంటలపై ఆసక్తి

అంతర పంటలపై ఆసక్తి 3
3/3

అంతర పంటలపై ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement