హోరాహోరీగా కబడ్డీ పోటీలు
ఫైనల్స్‌కు కోల్‌కతా,
మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ జట్లు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో కోల్‌కతా పోలీస్, మహారాష్ట్ర జట్లు, మహిళల విభాగంలో రాజస్తాన్, ఢిల్లీ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. శనివారం ఉదయం నుంచి లీగ్‌లో చివరి మ్యాచ్‌లు, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఫ్లడ్‌లైట్స్ వెలుతురులో అర్ధరాత్రి వరకూ ఫైనల్స్ జరగనున్నాయి. మ్యాచ్‌లను కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ నయీం హష్మీ తిలకించారు. గెలుపొందిన జట్లకు రూ.7.50 లక్షల ప్రైజ్‌మనీ, షీల్డ్‌లు అందిస్తారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ డి.శ్రీవేద, వీ.వీర్లెంకయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment