మధుమేహం ప్రధాన సమస్యగా పనిచేద్దాం
కడప కల్చరల్ : మధుమేహం ప్రపంచాన్ని అత్యంత వేగంగా అల్లుకుపోతోందని, త్వరలో ప్రపంచంలో 50 శాతం మంది ఈ వ్యాధితో బాధపడే ప్రమాదముందని లయన్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్య విభాగం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గ్లోబల్ యాక్షన్ టీం, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంతీయ సమావేశం సోమవారం స్థానిక మానస ఇన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కడప, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆతిథ్య విభాగమైన లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె.చిన్నపరెడ్డి, ఇతర అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎల్‌సీఐఎఫ్ ఏరియా ప్రతినిధి అంబటి సుధాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచమంతా మారుతున్న ఆహార శైలి అన్ని వయస్సుల వారిమీద విపరీత ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీసీ మల్టీబుల్ ప్రతినిధి ఏఆర్‌కే చౌదరి, పీడీజీ రమేష్‌నాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయి పనితీరు, స్ఫూర్తితో స్థానిక సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక విభాగాలు సేవలు అందించాలని సూచించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ గౌతమ్ మాట్లాడుతూ సేవలు అందించడంలో ఎంతో తృప్తి లభిస్తుందని, లయన్స్ క్లబ్ ద్వారా ఆ అవకాశం లభిస్తోందని తెలిపారు. జీఎస్టీ ప్రతినిధి ఇ.గోపాలకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ ఎం.విరూపాక్షిరెడ్డి, లయన్ చంద్రప్రకాశ్ మాట్లాడారు. కడప అన్నమయ్య క్లబ్ అధ్యక్షుడు అనంతబొట్ల వెంకట సుబ్బయ్య, పూర్వ అధ్యక్షుడు పోతుల వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు, కోశాధికారి రవీంద్రనాథ్, పి.సంజీవరెడ్డి, జోజిరెడ్డి, కొండారెడ్డి, గంగాధర్, వర్మల ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో విశేష కృషి చేసిన లయన్ సభ్యులకు నిర్వాహకులు అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment