దైవ దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా
జమ్మలమడుగు రూరల్ : గండి క్షేత్రానికి దైవ దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ కల్పన కథనం మేరకు వివరాలు ఇలా.. జమ్మలమడు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన డక్కా వెంకట భార్గవి (30) ఆమె భర్త వెంకటసుబ్బయ్య, డక్కా వెంకటేశ్, డక్కా వెంకట సుజాత, డక్కా వెంకట సుబ్బమ్మ, సుగుణ, వెంకట్ మరి కొంత మందితో కలసి గండి క్షేత్రానికి ఆటోలో బయలుదేరారు. ప్రొద్దుటూరు బైపాస్ సమీపంలో లారీని ఒవర్ టేక్ చేయబోతుండగా డ్రైవర్ వెంకటయ్య అదుపు చేయలేక ఆటో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో వెంకట భార్గవి (30) అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఎస్‌ఐ కల్పన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. కాగా ప్రమాదానికి గురైన వారిలో ముగ్గురు అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఒకరి మృతి
8 మందికి స్వల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment