TS Special
-
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్‌తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్‌తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి -
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆది వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సరీ్వసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ► రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగాను ► సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది. ► హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నియమించింది. ► వెయిటింగ్లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారిగా బదిలీ చేసింది. -
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కారుచౌక జర్నీ
నగరానికి చెందిన అఖిల్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాలి. బస్సుల్లో రద్దీ చాలా ఉంది. రిజర్వేషన్‌లోనూ సీట్లు లేవు. వెంటనే తన వద్ద ఉన్న ఓ కార్‌పూలింగ్ యాప్ ఓపెన్ చేసి, సీటు బుక్ చేసుకుని రాజధానికి వెళ్లిపోయాడు. బదిలీల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు సైతం నలుగురు లేదా ఐదుగురు ఎంప్లాయీస్ కలిసి కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ఆఫీసులో పనిచేయడం, కారు అయితే స్టాపుల్లేకుండా నేరుగా ఆఫీసుకే వెళ్లే వీలుండటంతో కార్ పూలింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. అద్దెకారు జర్నీ ఖరీదైంది. ఇద్దరు కలిసి కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే రూ.5వేలకు తక్కువ ఖర్చవడం లేదు. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని చెప్పేస్తున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సరే అని వెళ్లిపోతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారు ప్రయాణాన్ని చౌకకే అందిస్తోంది. కార్ పూలింగ్‌కు కొన్నియాప్‌లు అందుబాటులో ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు కార్ పూలింగ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. కారు నిర్వాహకులకు సైతం ఇం‘ధన’ం ఆదా అవుతోంది. అసలేంటీ కారు‘చౌక’ జర్నీ అనుకుంటున్నారా..? చదవండీ సండే స్పెషల్..!! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కార్ పూలింగ్ కల్చర్ పెరిగిపోతోంది. పెరిగిన రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ విధమైన ప్రయాణానికి పెద్దపీట వే స్తున్నారు. జిల్లాకేంద్రాలైన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల నుంచి ప్రతిరోజూ రాజధానితో పాటు వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, నిజా మాబాద్ ఇలా ఏ ప్రాంతానికై నా కార్ పూలింగ్‌కే జై కొడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చైన్నె తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువు చేస్తున్నారు. వారాంతానికి ఉమ్మడి జిల్లాకు రావడం, తిరిగి సోమవారం ఉదయానికి వారి ఉద్యోగస్థానాలకు వెళ్లడం రివాజుగా మారింది. దీనికితోడు ప్రతిరోజూ కోర్టు కేసులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, రకరకాల అవసరాల రీత్యా రాజధానికి వెళ్లేవారి సంఖ్యకు లెక్కేలేదు. ఓనర్, రైడర్‌కు మేలు ఈ యాప్‌లు కార్లు లేని వారికి మాత్రమే కాదు సొంత వాహనాలు ఉన్న వారికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజూ చాలామంది ఉమ్మడి జిల్లాకు వివిధ పనులు, పండగలు, సెలవులకు వచ్చి, కుటుంబ సభ్యులను దింపి తిరిగి ఒంటరిగా వెళ్తుంటారు. అంటే గంటల కొద్దీ ప్రయాణం ఒంటరిగా చేయాలి. అదే సమయంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలీగ్స్ రానప్పుడు ఈ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నా రు. పెట్రోల్ ఖర్చు ఆదా కోసం బ్లాబ్లాకార్, క్విక్‌రైడ్ యాప్‌లో రైడ్ వివరాలు పోస్టు చేస్తున్నారు. క్షణాల్లో కారు ఖాళీ సీట్లు నిండిపోతున్నాయి. ఓనర్ ఆర్టీసీ చార్జీలే తీసుకుంటుండడం, అతనికి ప్రయాణంలో టైంపాస్.. పైగా పెట్రోల్ చార్జీలు కలిసొస్తున్నాయి. నచ్చిన చోట పికప్.. డ్రాప్ ఈ యాప్‌తో మరో సదుపాయం ఏంటంటే.. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు ముందు రైల్వేస్టేషన్/బస్టాండ్‌లో దిగుతాం. అక్కడి నుంచి మనం అనుకున్న స్థానాలకు వెళ్లాలంటే క్యాబ్‌లకు రూ.200, 300 పెట్టాలి. ట్రాఫిక్‌తో గంటలపాటు ఇరుక్కుపోతుంటారు. కానీ, ఈ యాప్ ద్వారా ఓనరు ప్రయాణించే మార్గంలో మనకు నచ్చిన చోట దిగవచ్చు. ఉదా: నిమ్స్ వెళ్లాలనుకుంటే మెహదీపట్నం వెళ్లే కారును ఎంచుకోవచ్చు. హైటెక్ సిటీ వెళ్లాలనుకుంటే కొండాపూర్ వెళ్లే కారును సెలెక్ట్ చేసుకుని, అక్కడే దిగిపోవచ్చు. చాలా కార్లు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండటంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. సమయానికి చేరుకోవచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కార్ పూలింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోని ప్రయాణించడం ద్వారా సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గమ్యానికి అనుకున్న సమయంలోనే చేరుకునే వెసులుబాటు ఉంది. వివిధ వ్యాపారాల రీత్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కార్ పూలింగ్ యాప్‌ను ఎక్కవగా వినియోగించుకుంటున్నారు. – శనిగరపు రవీందర్, ప్రభుత్వ ఉద్యోగి టోల్గేట్ల వద్ద తాకిడి పాత జిల్లాలో రెండు ప్రధాన టోల్గేట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ వద్ద రెండోది ఉంది. ఈ టోల్గేట్ల మీదుగా ప్రతీరోజూ రాకపోకలు సాగించే కార్ల వివరాలు (కిలోమీటర్లలో) ఇలా ఉన్నాయి. టోల్గేట్ హైదరాబాద్ వైపు హైదరాబాద్ నుంచి రేణిగుంట 5,500 సుమారు 5,000 సుమారు బసంత్‌నగర్ 1,500 సుమారు 1,100 సుమారు ఉమ్మడి జిల్లాలో కార్ల సంఖ్య ఇలా.. జిల్లాలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యాంకుల సులభ వాయిదా రుణాలు, మార్కెట్లోకి కొత్త కార్లు వస్తుండటం, కరోనా తరువాత భౌతిక దూరానికి ప్రాధాన్యం పెరగడంతో సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంది. ఇందుకు ఉమ్మడి జిల్లాలో రిజిష్టర్ అయిన కార్ల వివరాలే నిదర్శనం. కరీంనగర్: 47,023 సిరిసిల్ల: 11,911 జగిత్యాల: 12,824 పెద్దపల్లి: 10,400 -
కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ హామీల ఊసేలేదని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని చెప్పడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశముందని కాబట్టి ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బులను వెంటనే జమ చేయాలని కోరారు. ప్రభుత్వాలను కూల్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దినదినగండంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 1న గ్రూప్ –1 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని ఆ తేదీ గడిచినా కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలతోపాటు గ్రూప్ 2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దానిని అమలు చేయకపోవడమంటే ఆ పవిత్ర గ్రంథాన్ని చిత్తుకాగితంగా పరిగణిస్తున్నట్లేనని విమర్శించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీ చేశాయి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాష్ట్రాన్ని, దేశాన్ని దోపిడీ చేశాయని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ది అవినీతి, అక్రమాల చరిత్ర అని..అందుకే దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధమయ్యారన్నా రు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్‌రెడ్డి, బొల్లపు సురేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని కూడా కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్ ఏదీ? ఫిబ్రవరి 1న తెలంగాణ నిరుద్యోగ యువత కోసం గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకటిస్తామన్న హామీ ఏమైందని జి.కిషన్‌రెడి ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా కాంగ్రెస్ మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకుందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
రెండు గ్యారంటీలపై రేపు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కూలంకషంగా చర్చించి, అమలు చేసే తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ రెండింటితో పాటు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వ్యయం ఎంత అవుతుంది.? ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా 4వ తేదీన జరిగే సమావేశంలో ఏ రెండింటిని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని, 9న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. -
ఆ కార్లు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్: ఆ కార్లు ఎక్కడివి..ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఒకవేళ మీరే కొంటే..అందుకు సొమ్ము ఎక్కడిది? అంటూ మూడో రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడడానికి కొద్ది నెలల కిత్రమే రెండు కొత్త కార్లు శివబాలకృష్ణకు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందులో హోండాసిటీ కారును ఓ బిల్డర్, నెక్సాన్ కారు ఓ రియల్‌బ్రోకర్ నుంచి బహుమతిగా వచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాల మేరకు అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్ల విషయంతోపాటు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరిట నడుపుతున్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఏసీ బీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరిట మరో మూడు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం మూడో రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తొలిరోజు విచారణలో భాగంగా బుధవారం ఏడు గంటలు, గురువారం ఆరుగంటలపాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా ఉద యం చంచల్‌గూడ జైలు నుంచి శివబాలకృష్ణను తమ కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలుత రెరా కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ సోదా ల్లో రూ.కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. అయితే తొలి రెండు రోజులు ఏసీబీ విచారణకు సహకరించకపోయినా, వరుసగా కీలక పత్రాలు ముందుంచి తమదైన శైలిలో ప్రశి్నస్తుండడంతో శివబాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లలో భారీగా బంగారం? శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించినట్టు సమాచారం. ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంతమేర బంగారం, ఇతర పత్రాలు స్వా«దీనం చేసుకున్నారన్న సమాచారం పూర్తిగా తెలియరాలేదు. కాగా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత శివబాలకృష్ణపై మరికొందరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆ అంశాలపైనా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. శనివారం మరోమారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. -
కాపాడలేం.. అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో.. ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిడెడ్ (దిల్)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. హౌసింగ్‌బోర్డు, దిల్ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి. వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్‌వి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. భూములకు సంబంధించిన లావాదేవీల విషయంలో బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు డబ్బులు సమకూర్చడానికి బిల్డర్లు, భూ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకుంటామన్న రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్రపార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ నేతలు డీకే అరుణ, పి.మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసినందుకు, వికసిత భారత్ సాకారం చేయడానికి వీలుగా బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. హామీల అమలుపై క్లారిటీ లేదు ‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక రోడ్‌మ్యాప్ లేదు. ఇచి్చన హామీల అమలుపై క్లారిటీ ఇవ్వడం లేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ బూత్ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరి చేసుకోవాలి. గ్రామ స్థాయిలో నిత్యం కొత్తగా చేరికలు ప్రోత్సహించాలి. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలి..’అని కిషన్‌రెడ్డి సూచించారు. 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారా? తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెబుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదాధికారుల భేటీ తర్వాత నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు , ఇతరనాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఇచి్చన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించామని అరుణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 10 నుండి 12 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బిజీబిజీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించిన మేరకు రాష్ట్ర పార్టీ నాయకులు లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బిజీబిజీ కానున్నారు. ఈ నెలలో 17 ఎంపీ సీట్ల పరిధిలో బీజేపీ ‘విజయసంకల్ప రథ (బస్సు)యాత్రలు’నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతారు. 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో బాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటల పాటు ఉంటారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. 4 ,5, 6 తేదీల్లో పార్లమెంట్ ప్రవాసీ యోజన ఉంటుంది. 18 నుండి 24 వరకు నారీ శక్తి వందన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారుల సమ్మేళనాలు, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీలో ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు ఉంటాయి. నో మొబైల్స్! పార్టీ అంతర్గత సమావేశాల్లో ముఖ్యనేతలు చెబుతున్న విషయాలపై దృష్టి పెట్టకుండా నేతలు సెల్ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ.. శుక్రవారం నాటి పదాధికారుల భేటీకి మొబైళ్లను అనుమతించలేదని తెలిసింది. సెల్ఫోన్లు అన్నీ ఒకచోట డిపాజిట్ చేశాకే నేతలను సమావేశ మందిరంలోకి అనుమతించినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. -
రాంచీ టు శామీర్‌పేట
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్‌కు తరలించారు. రాంచీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు వారికి ఆహ్వనం పలికి రెండు ప్రత్యేక బస్సుల్లో శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ముగ్గురు నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. బలపరీక్ష జరిగేవరకు ఇక్కడే.. జార్ఖండ్‌లో పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ నేతలు బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ ముఖ్యులతో టచ్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యేలను క్యాంపు కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తామనే సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నమే వీరు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా పడింది. కాగా ఏఐసీసీ నేతలు ఆదేశాల మేరకు టీపీసీసీ వీరి క్యాంపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మాజీ జెడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్ పేరిట శామీర్‌పేట రిసార్ట్స్‌లో 38 రూంలు వీరి కోసం బుక్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలంతా మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల ఐదో తేదీన జార్ఖండ్ అసెంబ్లీలో చంపయ్ సోరేన్ బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం లేదంటే ముందు రోజు అర్ధరాత్రి వారు ప్రత్యేక విమానంలో రాంచీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. శిబిరానికి సీఎం రేవంత్! శుక్రవారం ఇంద్రవెల్లి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా క్యాంపునకు వెళ్లి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కలుస్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారన్న ఆలోచనతో వారిని హైదరాబాద్‌కు తరలించాలని ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా క్యాంపు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను టీపీసీసీ పూర్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు రిస్టార్టుకు వెళ్ళారు. -
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు!
అలా చేస్తే ఊర్లలోకి రానిస్తరా? ‘‘ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నరు. మూడు నెలలు, ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. నీ అయ్యా.. ఎవడు పడగొట్టేటోడు.. మా యువకులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. పడగొడితే వారంతా చూస్తూ ఊరుకుంటరా? ఊర్లలోకి రానిస్తరా? ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. మీ ఊర్ల వేపచెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలినట్టు అనుకున్నరా? ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరు’’ సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని, త్వరలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని కొందరు మాట్లాడుతున్నారని.. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం చేశారని.. తాము పునర్నిరి్మంచే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదిహేను రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. సీఎం రేవంత్ ఇందులో పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఆలోచించలేదు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. నాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తాం. గత పదేళ్ల పాలనలో ఏనాడైనా అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? గూడేలు, తండాలకు నిజంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మేం రూ.65 కోట్లతో ఇంద్రవెల్లిలో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేదా? ప్రగతిభవన్ వద్ద నాడు గద్దర్‌ను నిరీక్షించేలా చేసిన కేసీఆర్‌కు ఉసురు తగిలింది. మోదీ దగ్గర గులాంగిరీ.. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లను గెలిస్తే.. కేసీఆర్ వాటిని ఢిల్లీలో తాకట్టు పెట్టి మోదీ దగ్గర గులాంగిరీ చేశారు. ఇప్పుడు మోదీ, కేడీ ఒక్కటై ముందుకొస్తున్నారు. మతం పేరిట బీజేపీ, మద్యంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. నాటి ఘటనకు క్షమాపణ చెప్తున్నా.. 1981 ఏప్రిల్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లి పోరాటకారులను కాల్చి చంపి, ఇప్పుడు నివాళులు అరి్పస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నాటి సీమాంధ్ర పాలకుల కారణంగా ఆ ఘటన జరిగింది. దానిపట్ల నేను క్షమాపణ చెప్తున్నాను. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ధరణితో కోల్పోయిన భూములను అప్పగిస్తాం: భట్టి అటవీప్రాంతాల్లోని గిరిజనులకు నీటి వనరులను అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. సీఎం కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్, వివేక్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, మల్లురవి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. నాగోబాకు పూజలు చేసి.. మహిళలతో భేటీ.. ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఇక్కడి కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మెప్మా, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా దర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల స్కూల్ యూనిఫారాలు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. -
15 రోడ్లు అప్‌గ్రేడ్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమరి్పంచారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) ► చౌటుప్పల్–(ఎన్‌హెచ్65)–ఆమనగల్లు–షాద్‌నగర్ –సంగారెడ్డి (ఎన్‌హెచ్65) 182 కి.మీ ► మరికల్ (ఎన్‌హెచ్167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్150) 63 కి.మీ ► పెద్దపల్లి (ఎస్‌హెచ్1)– కాటారం (ఎన్‌హెచ్353సి) 66 కి.మీ ►పుల్లూరు (ఎన్‌హెచ్44)–అలంపూర్–జెట్‌ప్రోల్–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్765)–దేవరకొండ(ఎన్‌హెచ్176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్167)– నల్లగొండ (ఎన్‌హెచ్–565) 225 కి.మీ ► వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్167) 110 కి.మీ ► మన్నెగూడ (ఎన్‌హెచ్163)–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్ (ఎన్‌హెచ్–50) 134 కి.మీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి భారతమాల పథకం ఫేజ్–1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–చౌటుప్పల్‘) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:15 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్... స్పీకర్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. పార్టీ నేతల ఘన స్వాగతం గతేడాది డిసెంబర్లో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరగడం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యులు తుంటి మారి్పడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న కేసీఆర్ గురువారం ఊతకర్ర సాయంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కె. తారక రామారావు, హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులతోపాటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వెంట స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని పీవీ హాల్లో కేసీఆర్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. చాంబర్లో పనులు పూర్తికాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్... అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు చేయాలని భావించారు. అయితే వసతుల కల్పన పనులు పూర్తి కాకపోవడంతో నందినగర్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జనసమూహంలోకి వచ్చిన కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్కు నేతలు పోటీ పడ్డారు. -
కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రిని కలిసినా మీ వ్యక్తిత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాంగ్రెస్ నేతల ట్రాప్‌లో ఎమ్మెల్యేలెవరూ పడొద్దు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి’అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్యేగా గురువా రం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ భేటీ లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ఇతర అంశాలపై కూడా పలు సూచనలు చేశారు. ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు ఇవ్వండి ‘నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వండి. వారి నివాసాలు, క్యాంప్ ఆఫీసులకు వెళ్లకుండా వారి కార్యాలయాల్లో కలిసి సమస్యలు విన్నవించండి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో తొందర అవసరం లేదు. వారిని పెద్దగా తిట్టాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ నేతలు వాళ్లను వాళ్లే తిట్టుకోవడం త్వరలోనే చూస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. అవి హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్పై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యపడొద్దు, ప్రతిపక్షంలో ఉండటం తప్పుకాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజీలేని పోరాటం చేసేది బీఆర్ఎస్ మాత్రమే ‘ తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించాం. బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. ప్రభుత్వ విధానాలను నిశితంగా అ«ధ్యయనం చేస్తూ గాడి తప్పిన ప్రతీ సందర్భంలో ఎండగడదాం. ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో అండగా నిలబడాలి’అని కేసీఆర్ ఆదేశించారు. -
ఖమ్మం నుంచి అవకాశం ఇవ్వండి: మల్లు నందిని
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తెరపైకి కొత్త ముఖాలు వస్తున్నాయి. ఈసారి ఎంపీలుగా పోటీచేసే జాబితాలో పలువురు మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం గాందీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు. కాగా, ఇదే సీటుకు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ హాట్‌సీటుగా మారిందనే చెప్పవచ్చు. రెండోరోజు 34 మంది దరఖాస్తు రెండోరోజు 34 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే మహబూబాబాద్‌కు 9, నాగర్‌కర్నూల్‌కు 8, వరంగల్‌కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్‌కు 3 దరఖాçస్తులు వచ్చాయి. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఉస్మానియా విద్యారి్థనేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దరఖాస్తు అందజేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 41 మంది దరఖాస్తు చేశారు. కాగా ఈనెల 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని గాం«దీభవన్వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం
సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌కమిటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. రూ.500లకు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుంది? ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఇవ్వాలని, ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్‌కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొత్తం డేటా ఎంట్రీ రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. ఐదు గ్యారంటీలకు మొత్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఒకే పేరుతో రెండు మూడు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు కొందరు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు లేవని అధికారులు చెప్పారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు సరి చూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్, హోంశాఖ సెక్రటరీ జితేందర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. తేడాది బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు. ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్‌పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్లో రూ.185 కోట్లు కేటాయించారు. భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ: రూ.50 కోట్లు నగర ట్రాఫిక్‌కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్: రూ.10 కోట్లు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్లపల్లి శాటిలైట్ టెర్మి నల్:రూ.46 కోట్లు సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్‌ఫామ్స్, 5 పిట్ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు. మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు కాజీపేట మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర రెండోలైన్ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండు లైన్లు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్లో రూ.60 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్లో వ్యాగన్ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. -
పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ అధికారుల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని తెలిపారు. పోలీసుల పాత్ర క్రియాశీలకం కావాలి.. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లను సీఎం కోరారు. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. పోలీసుల సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
సిద్దిపేటలో ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’
భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మామూలుగా అయితే మనుషులు (వెయిటర్లు) ఆహారాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు వడ్డిస్తారు. కానీ ఇక్కడ రోబోలే స్వాగతం పలుకుతాయి. మనతో మాట్లాడి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాయి. ఆర్డర్ చేశాకా ఆ ఫుడ్‌ను ప్లేట్లో రోబోలే పట్టుకొస్తాయి. ఇది ఎక్కడో కాదు సిద్దిపేట పట్టణం కరీంనగర్ రోడ్డులో ఇటీవలె ప్రారంభమైన ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’. ఈ హోటల్ యజమాని తీసుకొచి్చన వినూత్న ఆలోచనకు భోజన ప్రియులు ఆకర్షితులవుతున్నారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్లో రెండు రోబోలను హైదరాబాద్ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్ ఆర్డర్ చేయండి సార్ అని పలుకుతుంది. మనకు నచి్చన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ఫ్లేట్లో కస్టమర్ కూర్చున్న టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్ అని చెబుతుంది. ఆడుకోవడానికి గేమ్స్ జోన్.. ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీకెండ్లో తాకిడి ఎక్కువ.. ఈ రెస్టారెంట్లో ఇతర హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్ చేసిన హోటల్‌కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్, నాన్‌వెజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కస్టమర్లు హోటల్‌కు క్యూ కడుతున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సిద్దిపేటలో రోబో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారని తెలిసి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వచ్చాం. ఫుడ్ ఆర్డర్ చేస్తే రోబోలు భోజనం తీసుకురావడం, అవి మాట్లాడడం డిఫరెంట్‌గా ఉంది. పిల్లలు రోబోలతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపు తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి రావడం సంతోషంగా ఉంది. – మేఘన, గృహిణి, సిద్దిపేట వినూత్న ఆలోచనతో.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా హోటల్లో రోబోలను ఏర్పా టు చేశాం. వాటితో భోజనం సప్లయ్ చేయిస్తున్నాం. రూ.6 లక్షల విలువ గల రెండు రోబోలను పెట్టి వాటి సాయంతో కస్టమర్లకు వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నాం. చార్జింగ్ బ్యాటరీల సాయంతో రోబోలు పని చేస్తాయి. హోటల్లో పనిచేసే వారు వీటిని ఆపరేట్ చేస్తారు. – సతీష్ రెస్టారెంట్ నిర్వాహకులు -
అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. ఎన్నికల సన్నద్ధత, ప్రచారం తదితరాలపై దృష్టి సారిస్తూనే అభ్యర్తుల ఎంపిక పైనా కసరత్తు జరుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కేవలం గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అవసరమైన చోట సిట్టింగులను కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు క్షేత్ర స్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. 1న కేసీఆర్ అభిప్రాయ సేకరణ గత ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మెజారిటీ సీట్ల సాధనపై కన్నేసిన బీఆర్ఎస్.. ఇప్పటికే రాష్ట్రంలోని లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరిలో 10లోగా 119 అసెంబ్లీ నియోజవకర్గాల్లోనూ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. మరోవైపు కాలుజారి పడి ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత పార్టీ కీలక నేతలతో ముఖాముఖి భేటీ జరపడంతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే చేవెళ్ల (రంజిత్‌రెడ్డి), జహీరాబాద్ (బీబీ పాటిల్), ఖమ్మం (నామా నాగేశ్వర్రావు) లోక్‌సభ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలకే మరోమారు టికెట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ సంకేతాలు ఇచ్చింది. కరీంనగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజవర్గాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూలులో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆశావహుల జాబితా పెద్దదే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి, మెదక్ సహా విపక్షాల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి పట్టున్న మెదక్ టికెట్‌ను సుమారు అరడజను మంది ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీఎస్పీఎస్సీ సభ్యులు ఆర్.సత్యనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా టికెట్ అడుగుతున్నారు. మల్కాజిగిరిపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, విద్యా సంస్థల అధినేత నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడెం నగేశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆరూరు రమేశ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు, మహబూబాబాద్ జెడ్పీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. నల్లగొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూలు నుంచి ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడు భరత్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని మార్చే పక్షంలో మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశముంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు మోతె శోభన్‌రెడ్డి (డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత భర్త) పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు పట్నం కమలాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దరఖాస్తు అందజేశారు. -
ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరన్న నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. సత్వరమే ‘టిమ్స్’పూర్తి చేయాలి... వరంగల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో చేపడుతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ కార్డులు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునీక్ నంబర్‌తో అనుసంధానించాలని.. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందిండానికి వీలవుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్... బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ చెప్పారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని... తద్వారా ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో నెలకొన్న సమస్యలను అధికారులు సీఎంకు వివరించగా ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఫార్మా కంపెనీల సీఎస్ఆర్... మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని సీఎం కోరారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు, ఆశ వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపై వాకబు చేసిన సీఎం.. అవి మరింత మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డీజీ కమలహాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ‘పెద్దలు’ ఎవరో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ద్వైవార్షిక ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో, ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుండగా, 27న ఎన్నిక జరగనుంది. అయితే 15వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో సందడి మొదలైంది. పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతుండగా, ఎవరికి చాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లో జరుగుతోంది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం, ఇటీవలి దావోస్ పర్యటన అనంతరం లండన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ముఖ్యమంత్రి భేటీ, తదితర పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుడిని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకటి ఢిల్లీకి, మరొకటి స్థానికులకు రెండు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వు చేయాలని భావిస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీని రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇందుకు కూడా సోనియా మొగ్గు చూపని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతల్లో పార్టీ ఎంపిక చేసే ఒకరిని తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. నేడు టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చ! మరో సీటుపై పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కావడంతో ఎస్సీ మాదిగ లేదా రెడ్డి లేదా బీసీలకు చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలతో పాటు రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు. అరడజనుకు పైగానే ఆశావహులు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు బలరామ్ నాయక్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, వి.హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరో? రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు రిటైర్ కానుండగా ఒక సీటు మాత్రం తిరిగి పార్టీకి దక్కనుంది. ఈ స్థానంలో తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. 2018 ఏప్రిల్ 13న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన ఆరేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే 2022 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రకాశ్ ప్రస్తుతం మండలి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు సుమారు రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కినందున మరోమారు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గానికి చెందిన వారికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున డాక్టర్ కె.కేశవరావు (మున్నూరు కాపు), దామోదర్ రావు (వెలమ), పార్థసారథి రెడ్డి (రెడ్డి), కేఆర్ సురేశ్‌రెడ్డి (రెడ్డి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ లేదా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేస్తారననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనకు వచ్చే అవకాశముందని అంటున్నారు.