TS Special
-
సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్...ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా ప్రతిభ ఏంటో నిరూపిస్తాం’ అంటున్నారు పలువురు ఇన్స్పెక్టర్లు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగైతే రెజ్యూమ్‌లు సమర్పిస్తారో.. అచ్చం అలాగే పలువురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్హెచ్ఓ బాధ్యతల కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అవినాశ్ మహంతి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఠాణాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేలుస్తూ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనరేట్‌లోని ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. సమర్ధత, నిబద్ధతలకే ప్రాధాన్యం.. గతంలో ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టు పొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు సమర్పిస్తే తప్ప.. పోస్టింగ్ వచ్చేంది కాదు. హై ప్రొఫైల్ పీఎస్ అయితే డిమాండ్ మారీ ఎక్కువగా ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు. సిఫారసు లేఖలతో వస్తే పోస్టింగ్ సంగతి దేవుడెరుగు.. కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త పోలీసు బాస్‌ల రాకతో ప్రతిభ, సమర్ధత, విశ్వసనీయత, నిబద్ధతలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఠాణాలకే కాకుండా ప్రధాన నగరంలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు సైతం కొత్త వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఠాణాలకు తొలిసారిగా ఎస్హెచ్ఓలు.. ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం ఒక్కసారి కూడా ఎస్హెచ్ఓగా పోస్టింగ్ పొందని వారు చాలా మందే ఉన్నారు. పీఎస్‌లో రెండవ ప్రాధాన్య పోస్టు అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గానో, క్రైమ్ వింగ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఐటీ ఇతరత్రా విభాగాలలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితులలో వీరందరిలో ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు 40–50 మంది ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టింగ్ కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే మాదాపూర్, మెకిలా, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, దుండిగల్, శంషాబాద్, జీడిమెట్ల ఠాణాలకు ఎస్హెచ్ఓ పోస్టింగ్ పొందిన ఇన్స్పెక్టర్లు తొలిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నియమితులైనవాళ్లే. అలాగే ఆర్జీఐఏ, ఇతర కొన్ని పీఎస్‌లలో రెండవ సారి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నియమితులయ్యారు. త్వరలోనే గచ్చిబౌలి , రాయదుర్గం, నార్సింగి వంటి హైప్రొఫైల్ ఠాణాలకు సైతం కొత్త అధికారులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. -
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా...
సాక్షి, హైదరాబాద్: ‘రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తాను’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నెల రోజుల పాలనపై ఆదివారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని రేవంత్ భరోసా ఇచ్చారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. మన ఆడబిడ్డల మొహంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ నెల రోజుల పాలన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, రాష్ట్రంలో నెల రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఔ కాగా, రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నాం. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ నెల రోజుల పాలన సాగింది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’ అంటూ కామెంట్స్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT — Revanth Reddy (@revanth_anumula) January 7, 2024 -
TS BJP: టార్గెట్ ఎలక్షన్స్.. బీజేపీ మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్త ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది. వివరాల ప్రకారం.. బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సారధిగా కిషన్‌రెడ్డి ఉన్నారు. ఇక, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కోసం పది కమిటీలను బీజేపీ వేసింది. పది కమిటీలతో కిషన్‌రెడ్డి నేడు, రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. మరోవైపు, బీజేపీ మళ్లీ చేరికల సమన్వయ కమిటీని వేసింది. ఇక, చేరికల కమిటీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక, కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే, ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరుగనున్నాయి. -
స్పా సెంటర్లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహా్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. నానల్‌నగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్క్లబ్లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్స్పెక్టర్ సూచించారు. -
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్‌సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్‌కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు -
సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్‌లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు. సురేందర్ కు నిఖిత కజిన్ సిస్టర్ గా గుర్తించామన్నారు. నిఖితతో వెంకటకృష్ణకు పరిచయం ఉందని, వీళ్ళిద్దరూ కలిసి సురేష్ తో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సురేందర్ తో కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేయించారు. వారికి సహకరించాలని చెప్పారని ముందే ప్లాన్ వేశారు. అయితే.. నిఖిత, వెంకటకృష్ణ లు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.. సురేష్ తో కలిసి నిఖిత , వెంకట కృష్ణలు కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తెలిపారు. గతంలోనూ వీళ్ళు కిడ్నాప్ లు చేసిన కేసులు వున్నాయని తెలిపారు. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. సురేష్, వెంకటకృష్ణ లపై పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై 21 కేసులు ఉండగా, వెంకటకృష్ణ పై రెండు కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. -
TGO అధ్యక్షురాలు మమతకు షాక్..బదిలీ వేటు.!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం రాజధాని నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీలోనూ బదిలీలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జె.శంకరయ్యను ఇప్పటికే టీఎస్టీఎస్ ఎండీగా పంపించిన సర్కారు... తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను మూడు జోన్లలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మహిళలే కావడం గమనార్హం. ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇప్పటి వరకు తాను కోరుకున్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడికీ కదలబోననే విధంగా వ్యవహరించిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచి్చన అభిలాష అభినవ్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ,ఐటీ)గా ఉన్న స్నేహ శబరీ ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా మార్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థ అయిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌కు బదిలీ చేశారు. ► వీరితో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో ఎస్ఈగా ఉన్న వెంకటరమణను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీ)కు బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్లుగానే దీర్ఘకాలికంగా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారిని, డిప్యుటేషన్‌పై వచ్చి కీలక స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ని పంపించేందుకు సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వెలువడినప్పటికీ జాప్యం లేకుండా బదిలీలు చేసింది. త్వరలోనే మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. అంతర్గత బదిలీలు సైతం ఎన్నికల స్పెషలాఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాసరెడ్డిని ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా నియమించారు. అక్కడ డీసీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్యను ఫలక్‌నుమా ఏఎంసీగా అక్కడే ఉంచారు. సంతోష్ నగర్ డీసీగా ఉన్న వి.నరసింహను కుత్బుల్లాపూర్ డీసీగా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీ ఎ. నాగమణిని సంతోష్ నగర్ డీసీగా బదిలీ చేశారు. డీసీ (ఫైనాన్స్)గా ఉన్న ఎల్.శ్రీలతను చారి్మనార్ డీసీగా బదిలీ చేశారు. చారి్మనార్ డీసీగా ఉన్న ఢాకు నాయక్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మరిన్ని మార్పులు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో త్వరలోనే పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల బదిలీలతో పాటు పనుల్లోనూ మార్పులు చోటు చేసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టత వచ్చాక ఆమేరకు మార్పులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నగరానికి సంబందించి మొదటి సమీక్ష సమావేశాన్ని ఈ నది గురించే నిర్వహించడం.. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలోనూ మూసీని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
3 క్లస్టర్లుగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్త విధానంలో తెలంగాణను మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి హైదరాబాద్ తరహాలో తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అత్యున్నత అభివృద్ధి సాధనే లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని తీసుకుని వస్తామ సీఎం చెప్పారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో అత్యున్నత అభివృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే వాదనలకు భిన్నంగా తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాము తెచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా విలేజీల అభివృద్ధి ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్య రహితంగా, పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించటం లేదని సీఎం స్పష్టం చేశారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా చూస్తామని, యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు సి.శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షమియుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగం.. ఓ రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులు అంతర్నిర్మిత దురభిప్రాయాలను వదిలించుకోవాలని, రాజ్యాంగ నైతికతను అన్ని సమయాల్లో సమర్థించాల్సిన అవ సరం ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు సూచించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ హైకోర్టు శనివారం సంయుక్తంగా నిర్వ హించిన దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగింది. ఈ సద స్సుకు హాజరైన న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలను ఉద్దేశించి వారు మాట్లాడారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మాట్లాడుతూ.. ‘కేవలం లక్ష్యాలను సాధించా లనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ప్రయత్నించకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని తీర్పుల్లో నాణ్యతను మరింత పెంచాలి. వీలైనంత త్వరిత పద్ధతిలో గుణాత్మక, సమర్థవంతమైన న్యా యాన్ని అందించాలి. బెయిల్ కోసం ఇంకా అనేక మంది నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని అత్యంత ప్రాధాన్యమైన ఆర్టి కల్ 21ని రక్షించడానికి మనం తీవ్రంగా కృషి చేయా లి. ఈ సోషల్ మీడియా యుగంలో మన పనితీరు పై ప్రజల పరిశీలన పెరిగిందన్న విషయాన్ని న్యా యమూర్తులు తెలుసుకోవాలి. న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ ఎల్లప్పుడూ అవసరం. నాకు నచ్చిన సిటీల్లో హైదరాబాద్ ఒకటి. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయం. కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయమూర్తికైనా శిక్షణ అవసరమే. ఒక్కో రాష్ట్రంలో చట్టాల్లో మార్పులు ఉంటాయి. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగించాలి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా న్యా యమూర్తుల విధి నిర్వహణ ఉండాలి. న్యాయ వ్యవస్థ తమకు ఓ రక్షణ కవచం అన్న భావన కల్పించాలి. సామాన్యుల విశ్వాసం చూరగొన్నప్పుడే న్యా యవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు. ఆ విశ్వ సనీయత కోల్పోయిన రోజు ఈ వ్యవస్థ నిష్ప్రయో జనం. అంతిమంగా రాజ్యాంగ సారాంశం సమా నత్వమే. పక్షపాతాలను పక్కకు పెట్టి పనిచేయాలి. న్యాయమూర్తులు ఉపన్యాసాలు ఇవ్వడం మాని.. చట్టప్రకారం మాత్రమే తీర్పులు వెల్లడించాలి’అని సూచించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. రా జ్యాంగం కేవలం ఒక చట్టపరమైన డాక్యుమెంట్ మాత్రమే కాదని, ప్రజల రక్షణ కవచమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజోయ్ పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, తెలంగాణ, ఇతర హైకోర్టుల న్యాయమూర్తులు మాట్లాడారు. -
సౌర వెలుగుల దిశగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు. ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో 200 మంది విద్యార్థినులకు అస్వస్థత
జిన్నారం(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం శివారులోని నారా యణ కళాశాలలో విద్యార్థినులు వాంతులు, విరోచ నాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. నారాయణ బాలికల కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉన్నారు. నెలరోజుల నుంచి విద్యార్థినులు విరోచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని యాజ మాన్యం గుట్టుగా ఉంచటంతోపాటు రహస్యంగా విద్యార్థినులను ఇంటికి పంపిస్తోంది. వారంరోజు ల్లో 200 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలు కావ టంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. కలు షిత నీరు, ఆహారం వల్లే ఇబ్బందులు పడుతున్నా మని విద్యార్థినులు వాపోయారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి వెంక టేశ్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదే తప్ప విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యం దృష్టి సారించటంలేదని విమర్శించారు. సంక్రాంతి పండుగ పేరిట విద్యార్థినులకు పది రోజులపాటు యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు. -
ప్రజాపాలనకు 1.25 కోట్ల దరఖాస్తులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా భారీస్థా యిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన శనివారం(జనవరి 6)తో ముగిసింది. ఈ ఎనిమిది రోజుల్లో 1,24,85,383 పైగానే దర ఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమా నికి అధి కార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ కంప్యూటరీకరణ కోసం డీటీపీ ఆపరేటర్లను సైతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటోంది. డిప్యూటీ సీఎం భట్టి శ్రీకారం గతనెల 28వ తేదీన నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ఈ క్రార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా, సీఎం రేవంత్‌రెడ్డి ఎడతెగని పనులతో తీరి క లేకుండా ఉన్న నేపథ్యంలో ఎక్కడా పాల్గొనలేకపోయా రని ప్రభుత్వవర్గాల సమాచారం. ప్రజాపాలన కొనసాగు తుండగానే.. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం కూడా మంగళ, శుక్రవారాల్లో కొనసాగిస్తు న్నారు. ప్రజాపాలనలో పెద్దఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ... ప్రజావాణిలో సైతం శుక్రవారం వరకు దాదాపు 30 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. పోటెత్తిన సమస్యలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతు న్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానం అని సర్కారు తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ప్రారంభంలో ఇదివ రకే పెన్షన్ తీసుకుంటున్న వారు, రైతుబంధు లబ్ధిదారులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరణ ఇస్తూ.. పెన్షన్‌దారులు, రైతుబంధు పొందుతున్న వారు కొత్తగా రైతుభరోసా, చేయూత కింద దరఖాస్తు చేసు కోవాల్సిన అవసరం లేదని, కొత్తగా కావాల్సిన వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేయడంతో.. క్ర మంగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణిలో 30,148 అర్జీలు స్వీకరణ హైదరాబాద్(లక్డీకాపూల్): మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. గత నెల 8వ తేదీ నుంచి శుక్రవారం వరకు ప్రజావాణికి 30,148 అర్జీలు వచ్చాయి. తొలుత రోజూ నిర్వహించినా.. ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సీఎస్ సమీక్ష ప్రతిరోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమీ క్షించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఒక్క దరఖాస్తు.. అధికారి చొరవ..
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్‌డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది. గతంలో చెక్‌డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్‌డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. కదిలిన అధికారి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్లో నిర్వహించారు. కడెం మండల ఇన్చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్‌బైక్‌పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అధైర్య పడొద్దు..ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధికారం కోల్పోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, మున్ముందు మంచిరోజులు వస్తాయని శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రానున్నారని తెలిపారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తరువాత కోలుకుంటున్న కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు జరుపుతారని చెప్పారు. వచ్చే నెలలో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫొటో తొలగించినా ప్రజల గుండెల నుంచి తొలగించలేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే పనిలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందనీ కిట్ నుంచి కేసీఆర్ ఫొటో, పేరును తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయి దాలు అన్నట్టుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు.కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు ఇప్పటికీ వేయలేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు., ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కీలక పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు అధికారిక మీటింగ్‌లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. రెవెన్యూ తదితర కీలకమైన శాఖల్లో పోస్టింగ్‌లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారని, రేవంత్ మనుషులు విచ్చల విడిగా సిటీ చుట్టుపక్కల లే అవుట్లు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎంపీ వెంకటేష్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. రేవంత్ కనీస హోం వర్క్‌చేయడం లేదు: కడియం సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలి యదని, సీఎం దేనిపైనా కనీస హోం వర్క్ కూడా చేయడం లేదనిపిస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఫార్మా సిటీ, మెట్రో రైలుపై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారిందన్నారు. అదానీని నాగపూర్‌లో విమర్శించిన సీఎం హైదరా బాద్‌లో అదే అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకా లను ప్రారంభించకపోగా, కేసీఆర్ పథకాలను రద్దు చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించాలన్నారు. దళితబంధు పథకంలో సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాన్నే ఎత్తివేస్తూ దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
ఎర్రుపాలెం: ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా సోనియా గాంధీ అప్పగిస్తే గత పాలకులు రూ.లక్షల కోట్ల అప్పులు మిగి ల్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. అయినప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రజల కోసం పార్టీలకతీతంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపా డులో శనివారం జరిగిన ప్రజాపాలన సభలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన రోజునే మహిళలకు ఉచిత బస్సుప్ర యాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం ద్వారా రెండు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. అయితే, కొందరు ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండాలని కోరుకుంటున్నా.. వారి కోరిక నెరవేరదని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి భట్టి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదని చెబుతూ, కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని బీఆర్ఎస్ అడిగితే ప్రజలు మాత్రం కరెంట్‌తో పాటు కాంగ్రెస్ కూడా కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని తెలిపారు. పదేళ్లు పాలించిన వారు నెల కాక ముందే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెట్టారో చెప్పేందుకే శ్వేత పత్రాలను విడుదల చేశామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వం ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతా లు ఇవ్వలేదని, తాము 5వ తేదీలోపు ఇచ్చామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని భట్టి వెల్లడించారు. విద్యుత్ రంగంపై రూ.లక్ష కోట్లు అప్పుల భారం ఉన్నా 24 గంటల కరెంట్ ఇస్తామని, ప్రతీ మండలంలో అత్యున్నతస్థాయి పాఠశాలలు ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. అనంతరం మామునూరులోని తాగునీటి ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుపై బీజేపీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కచ్చి తంగా పది గెలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న కీలక సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఎన్నికల కసరత్తు నిమిత్తం 10 కమిటీలను నియమించనుండగా, రాష్ట్ర పార్టీ ఆ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీల నియామకానికి ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికల కమిటీ ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా జి.కిషన్‌రెడ్డి నియమితులు కాగా, సభ్యులుగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జీలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా మొత్తం 13 మందిని నియమించినట్టు సమాచారం. శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ సమన్వయకర్తగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇన్చార్జిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర కమిటీతో పాటు కొత్త ఓటర్లతో సమ్మేళన కమిటీకు కార్యదర్శిగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీకి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా.ఎస్.ప్రకాష్‌రెడ్డి, హర్గావ్ జానా (ప్రతీ గ్రామాన్ని సందర్శించే)కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీలో ఆ ముగ్గురూ! పార్టీ చేరికల కమిటీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ పొంగులేటి సుధాకరరెడ్డి సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల చైర్మన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని (అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన త్రిపుర గవర్నర్‌గా నియామకం) నియమించగా ఆ బాధ్యతల నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈటలకు బాధ్యతలు అప్పగించగా, ఇప్పుడు ముగ్గురితో కలిసి చేరికల కమిటీని నియమించినట్టు పార్టీ నాయకుల సమాచారం. టార్గెట్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేంద్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర పరిమితం కాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి పెద్దగా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు లేనందున కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఆన్‌లైన్‌లోకి.. ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు. ► జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ► వచి్చన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. ► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ► అధికారులు అర్జీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్‌కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్నారు. ► అయితే తెల్ల రేషన్‌కార్డు లేనివారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. గడువులోగా నమోదు పూర్తిచేస్తాం ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ -
సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసుకుంటూ వెళ్తోందని భారత్ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అయితే గృహలక్ష్మిలో భాగంగా ఎంపికై, అధికారిక పత్రాలు అందుకున్న లబ్ది దారుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటా మొత్తం చెల్లించిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధును కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితబంధును మరింతగా విస్తరించి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ది దారులకు రూ.10 లక్షలు లేదా కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.12 లక్షలైనా వెంటనే అందించాలన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ది దారులకు అండగా నిలబడేలా నిరసనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు తెలిపారు. లబ్ధిదారుల కోసం పార్టీ బాధ్యులంతా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు సైతం రద్దు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మండిపడ్డారు. మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ, ఇతర సంస్థల ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మంజూరును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై లబ్ది దారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
మన పార్టీ వాళ్లే ఓడించారు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారం జరిగిన చేవెళ్ల సమావేశంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మన వాళ్లే పనిచేశారని ఓడిన నా యకుడు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాండూరు అసెంబ్లీస్థానం నుంచి ఓడిపోయిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై సభా వేదికగానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. ఓడిన నేతను వేదికపై ఎలా కూర్చోబెడతారు? సమావేశంలో పైలట్ రోహిత్‌రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడాన్ని పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు తప్పు పట్టడంతో వివాదం రేగింది. ఓడిపోయిన నాయకున్ని స్టేజీ మీద ఎలా కూర్చోబెడతారని, రోహిత్‌రెడ్డిని కిందికి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం పట్టుపట్టింది. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, ఆయన వల్లనే ఓడిపోయామని పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారని సమాచారం. ఈ సమయంలోనే మహేందర్‌రెడ్డి కారణంగానే తాను ఓడినట్లు రోహి త్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో మహేందర్ రెడ్డి సైతం రోహిత్‌పై విమర్శలు చేసినట్లు చెబుతున్నారు. ఓ సమయంలో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు అరుచుకుంటూ కుర్చిలు విసిరేసే వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి టి. హరీశ్‌రావు జోక్యం చేసుకొని పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో గొడవ పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం: పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించామని, మరోసారి గెలిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై కొందరిలో ఆవేదన ఉందని, ఇప్పుడన్నీ సమసిపోయాయన్నారు. ఇల్లు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే తన బలం, చేవెళ్ల పార్లమెంట్ ప్రజలే తన బలగమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. -
ఎవరెవరికి... ఏమేమిద్దాం!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ పదవులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల గాందీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన తర్వాత ఈ చర్చ ఉధృతమైంది. భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపై స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది? తొలిదఫాలో ఎన్ని కార్పొరేషన్లు భర్తీ చేస్తారు? అందులో కీలకమైన కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయి? ఆ కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్ హోదాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పుడు గాందీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటుండటం గమనార్హం. ఇక, సంక్రాంతికి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ, సంక్రాంతికి ముందే ఉంటుందా? లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టత రావడం లేదు. అటు ఎమ్మెల్యే కోటా, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లోగా ఖాయం అయితే, లోక్‌సభ ఎన్నికల్లోపు మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ భర్తీ ఉంటుందనే చర్చ జరుగుతుండగా, సంక్రాంతిలోపు భర్తీ చేస్తే మాత్రం తొలి దఫాలో కేవలం 10 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులే నింపుతారని, అదే జాప్యం జరిగితే మాత్రం కొన్ని పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తొలిదఫా నామినేటెడ్ పందేరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకని వారు, పార్టీ కోసం త్యాగం చేసిన వారు, జిల్లా స్థాయిలో ముఖ్య హోదాల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశముంటుందని సమాచారం. ఆశావహులు ఎవరెవరంటే.. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఒబేదుల్లా కొత్వాల్, చారకొండ వెంకటేశ్, రాజీవ్‌రెడ్డి, కేతూరి వెంకటేశ్ (మహబూబ్‌నగర్), కె.కె.మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రమ్యారావు, నేరెళ్ల శారద (కరీంనగర్), చల్లా నర్సింహారెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సామా రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), విశ్వప్రసాద్, నల్లాల ఓదెలు (ఆదిలాబాద్), రవళి, వెన్నం శ్రీకాంత్ (వరంగల్), మెట్టు సాయికుమార్, మోతె రోహిత్, నూతి శ్రీకాంత్ (హైదరాబాద్), అన్వేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్, కాసుల బాలరాజు, గడుగు గంగాధర్ (నిజామాబాద్), త్రిషా దామోదర్, ఆంజనేయులు గౌడ్ (మెదక్), బొర్రా రాజశేఖర్, లోకేశ్‌యాదవ్, కోటా రాంబాబు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సాధు రమేశ్‌రెడ్డి, నాగా సీతారాములు, తూళ్లూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్, శంకర్‌నాయక్, పున్నా కైలాశ్‌నేత, సర్వయ్య, ముత్తినేని వీరయ్య వర్మ, చెవిటి వెంకన్న యాదవ్ (నల్లగొండ) తదితరులు కీలక కార్పొరేషన్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నేతలు కూడా బడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఆశలపల్లకిలో 3వేలమంది ఇక, మరికొన్ని కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్ల స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య 3వేలకు పైగా ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో కొందరికి ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం మాత్రం అధికార కాంగ్రెస్ వర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు యాభై వాస్తవానికి, రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు చిన్నా చితకా, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 50 వరకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. వీటిని వీలున్నంత త్వరగా భర్తీ చేస్తే రెండేళ్ల పదవీ కాలం చొప్పున మరో రెండు మార్లు ఇతర నేతలకు అవకాశమివ్వచ్చని, అలా 1,500 మంది వరకు నేతలకు నామినేటెడ్ పదవులు ఈ ఐదేళ్ల కాలంలో పంపిణీ చేయవచ్చనేది టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తొలిదఫా భర్తీ ఎప్పుడు పూర్తవుతుందన్న దాన్ని బట్టి 1,500 మంది వరకు అవకాశం కల్పించవచ్చని, జాప్యం జరిగిన కొద్దీ నేతల సంఖ్య తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఏఐసీసీ సిఫారసులు... ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు 5–10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. -
యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ!
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)’ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం సహకరించాలని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు. తగిన సహకారం అందించండి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో రేవంత్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు. వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు. ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. సీఎం దృష్టి సారించడం అభినందనీయం టీఎస్పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్షణశాఖ భూములను రాష్ట్రానికి ఇవ్వండి యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రాష్ట్ర బృందం భేటీ అయి చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణం, విస్తరణ కోసం.. రక్షణశాఖ పరిధిలో ఉన్న పలు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్ కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని.. అక్కడ రక్షణశాఖ పరిధిలో ఉన్న కాస్త భూమిలో మినహా మిగతా భాగం పూర్తయిందని వివరించారు. ఆ భూమిని వెంటనే బదిలీ చేస్తే.. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కరీంనగర్–రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వరకు 11.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44)పై కూడా కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించామని.. ఇందులో 12.68 కిలోమీటర్ల మేర నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాల కోసం మరో 56 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2019–20 నుంచి 2023–24 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను కట్టుదిట్టం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాల్లో సర్విస్ కమిషన్ల ను అధ్యయనం చేయాలని ఆదేశించింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) కార్యాలయానికి వెళ్లి చైర్మన్, కార్యదర్శులతో భేటీ అయ్యారు. మెరుగ్గా ఉందని చెప్పినా.. ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్విస్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పీఎస్సీ మెరుగ్గా ఉందని, ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో ముందుందని అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా పనిచేసిన ఘంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్ల తో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా కూ డా వ్యవహరించారు. దరఖాస్తుల నుంచి పరీక్షలు, నియామకాల దాకా టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నా యి. అయితే పలు పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. కఠిన నిబంధనలు.. కొత్త సాంకేతికతతో.. టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి.. అత్యాధునిక సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం టెక్ దిగ్గజాల సహకారం తీసుకోనుంది. కమిషన్‌లో కంప్యూటర్లను సైతం పూర్తిగా మార్చేసి.. సరికొత్త, భద్రమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల బయోమెట్రిక్ ఉంటేనే కంప్యూటర్లు పనిచేసే లా సాంకేతికతను వినియోగించాలని భావిస్తోంది. ఇప్పటివరకు కేరళ, ఇతర రాష్ట్రాల్లో పబ్లిక్ సర్విస్ కమిషన్ల పనితీరును రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. మరింత లోతుగా అధ్యయనం జరిపాక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని అధికారులు చెప్తున్నారు. -
ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే.. రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా వచ్చేవి. రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు.