Tirupati
-
తిరుమల: సర్వదర్శనానికి 6గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న ( బుధవారం) 59,231 మంది స్వామివారిని దర్శించుకోగా 22,029మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.08 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆన్లైన్లో 2025 ఫిబ్రవరి నెల ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు విడుదలనేడు ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాళంకరణ టికెట్లు విడుదల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను విడుదల4వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల... -
కారిడార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: వైజాగ్–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్‌తోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ పారిశ్రామిక వాడల్లో నీటి సరఫరా పైపులైన్ల పనులు వేగవంతం చేయాలని, ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శెట్టిపల్లె భూ సమస్యలకు పరిష్కారం చూపండి దీర్ఘకాలంగా కొనసాగుతున్న శెట్టిపల్లె భూ సమస్యలకు త్వరిగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలను గుర్తించాలన్నారు. ఎంత దరఖాస్తుదారులు ఉన్నారు? వారు కొనుగోలు చేసిన లేఔట్ల మ్యాప్‌ను సిద్ధం చేసి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, అర్బన్ తహసీల్దార్ కేవీ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశం -
ఏనుగుల గుంపు హల్చల్
చిన్నగొట్టిగల్లు, పులిచెర్ల మండలాల సరిహద్దులోని పొలాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి.తిరుపతి జిల్లా పరిధిలోకి తీరం జిల్లాల విభజనతో ఏర్పాటు అయిన తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్రతీరం వచ్చి చేరడంతో తీరం లేని రాయలసీమకూ సముద్ర తీరం వచ్చిచేరింది. ఇది చిల్లకూరు మండలం నుంచి నుంచి తడ మండలం వరకు ఐదు మండలాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది. అందులో చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో 53 మత్స్యకార గ్రామాలు, కుప్పాలు ఉన్నాయి. వీరు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు ఏడు ప్రాంతాల్లో సముద్ర ముఖద్వారాలున్నాయి. వేట తప్ప మరో వృత్తి తెలియని 16 వేల మత్స్యకార కుటుంబాలు సముద్రం మీదే ఆధారపడి జీవనం చేస్తారు. వీరికి 35 మరపడవలు, 4 వేలకు పైగా ఇంజిన్లు, సాధారణ బోట్లు ఉన్నాయి. వీరిలో నిరక్ష్యరాస్యత కూడా ఎక్కువ. ఇటీవల కాలంలో కొంత మార్పులు వస్తున్నప్పటికీ వీరు ప్రగతి పథంలో పయనించలేకపోతున్నారు. మత్స్యకారుల ప్రగతి కోసం గత ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినప్పటికీ నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తూ మత్స్యకారులను మరింత వెనక్కి నెట్టి వేస్తుంది. వైఎస్సార్ సీపీ సర్కారులో భరోసా వివరాలివీ.. – 8లో -
కారిడార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: వైజాగ్–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్‌తోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ పారిశ్రామిక వాడల్లో నీటి సరఫరా పైపులైన్ల పనులు వేగవంతం చేయాలని, ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శెట్టిపల్లె భూ సమస్యలకు పరిష్కారం చూపండి దీర్ఘకాలంగా కొనసాగుతున్న శెట్టిపల్లె భూ సమస్యలకు త్వరిగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలను గుర్తించాలన్నారు. ఎంత దరఖాస్తుదారులు ఉన్నారు? వారు కొనుగోలు చేసిన లేఔట్ల మ్యాప్‌ను సిద్ధం చేసి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, అర్బన్ తహసీల్దార్ కేవీ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశం -
వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
రామచంద్రాపురం: ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మెడ్జీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన 200 మంది ఉపాధ్యాయులకు 6 రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గత ఏడాది తొలి విడత 21వ శతాబ్దపు విద్యా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వగా ఈ ఏడాది సమ్మిళిత విద్య, వాతావరణ మార్పులు, స్కూల్ లీడర్షిప్, అకౌంట్స్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఏఎంఓ శివశంకరయ్య, ఏఏఎంఓ మధు, చంద్రగిరి ఎంఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యకళాశాలకు సుజుకీ ఎకోవ్యాన్ విరాళం
తిరుపతి తుడా: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు రు యా విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ టి.భారతి రూ.7 లక్షల విలువగల మారుతీ సు జుకీ ఎకో వ్యాన్‌ను విరాళంగా అందజేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిరెడ్డి బుధవారం నూతన వాహనాన్ని వైద్య కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి చంద్రశేఖరన్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ కిరీటి, డాక్టర్ కె సునీత, డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రాపూరు: మండలంలోని రాపూరు, సిద్ధవరం, జోరేపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న చెంచయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయానికి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సిద్ధవరం పంచాయితీ కోటురుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తన తండ్రి శంకరయ్య మరణ ధ్రువీకరణపత్రం కోసం పలుమార్లు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్టిఫికెట్ జారీ చేయలేదు. పైగా చెంచయ్య ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడంతోపాటు వీడియో కాల్ చేయాలని, గూడూరుకు రావాలని వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె ఈ నెల 4వ తేదీన జరిగిన గ్రీవేన్స్లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపి, నివేదిక అందించాలని ఆదేశించారు. అధికారులు బాధితురాలిని విచారించి నివేదిక అందించారు. పంచాయతీ కార్యదర్శి తప్పు చేశారని నిర్ధారణ కావడంతో చెంచయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీఓ భవాని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్మెంట్ నిండింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 62,248 మంది స్వామివారిని దర్శించుకోగా 18,552 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.71 కోట్లు సమర్పించారు. టైంస్లా ట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే, ద ర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్ర త్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయాని కి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కే టాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను అనుమతించబోరని స్పష్టం చేసింది. -
వైద్యకళాశాలకు సుజుకీ ఎకోవ్యాన్ విరాళం
తిరుపతి తుడా: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు రు యా విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ టి.భారతి రూ.7 లక్షల విలువగల మారుతీ సు జుకీ ఎకో వ్యాన్‌ను విరాళంగా అందజేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిరెడ్డి బుధవారం నూతన వాహనాన్ని వైద్య కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి చంద్రశేఖరన్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ కిరీటి, డాక్టర్ కె సునీత, డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రాపూరు: మండలంలోని రాపూరు, సిద్ధవరం, జోరేపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న చెంచయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయానికి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సిద్ధవరం పంచాయితీ కోటురుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తన తండ్రి శంకరయ్య మరణ ధ్రువీకరణపత్రం కోసం పలుమార్లు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్టిఫికెట్ జారీ చేయలేదు. పైగా చెంచయ్య ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడంతోపాటు వీడియో కాల్ చేయాలని, గూడూరుకు రావాలని వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె ఈ నెల 4వ తేదీన జరిగిన గ్రీవేన్స్లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపి, నివేదిక అందించాలని ఆదేశించారు. అధికారులు బాధితురాలిని విచారించి నివేదిక అందించారు. పంచాయతీ కార్యదర్శి తప్పు చేశారని నిర్ధారణ కావడంతో చెంచయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీఓ భవాని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్మెంట్ నిండింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 62,248 మంది స్వామివారిని దర్శించుకోగా 18,552 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.71 కోట్లు సమర్పించారు. టైంస్లా ట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే, ద ర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్ర త్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయాని కి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కే టాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను అనుమతించబోరని స్పష్టం చేసింది. -
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: జలజీవన్ మిషన్ పథకానికి చెందిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. జిల్లాలో 2,532 పనులకు సంబంధించి ఇప్పటివరకు 1,333 పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులు వచ్చే డిసెంబర్‌కి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఇంజనీర్ విజయకుమార్‌ను ఆదేశించారు. మరోవైపు ఎంపీ లాడ్స్ కింద మంజూరైన నిధులకు చెందిన పనులు, జెడ్పీ, సీపీడబ్ల్యూఎస్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ పాఠశాలల్లోను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పంచరామాలకు ప్రత్యేక బస్సు – రేపటి నుంచి 24 వరకు యాత్ర తిరుపతి అర్బన్: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పంచరామాల దర్శనం కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు తిరుపతి డిపో మేనేజర్ బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి బస్టాండ్ నుంచి బస్సు సర్సీసు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సర్వీసు నెల్లూరు, గుంటూరు, విజయవాడ మీదుగా సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పరి సరాల్లోని పంచరామాలలో ఆలయ దర్శనం ఉంటుందన్నారు. ఇందుకోసం సూపర్ లగ్జరీ సర్వీసును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సర్వీసు ఈ నెల 24వ తేదీన తిరిగి తిరుపతి బస్టాండ్‌కు చేసుకుంటుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ కోసం 94409 83564, 89193 22158 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు శివక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి జిల్లా రగ్బీ జట్టుకు శిక్షణ శిబిరం ప్రారంభం బుచ్చినాయుడుకండ్రిగ: చదువుతోపాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని ఎంఈఓ రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్–17 ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్థానికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలి కల జట్టు శిక్షణ ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు వీరికి పీడీ, పీఈటీలు శిక్షణ ఇస్తారన్నారు. విద్యార్థులు శిక్షణతో మరింత రాటుదేలి క్రీడాపోటీల్లో సత్తా చాటి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య, గ్రామస్తులు సుధాకర్‌నాయుడు, వ్యాయామోపాధ్యాయులు కిషోర్, మస్తాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వంకలో పడి వృద్ధుడి మృతి నాగలాపురం: వంకలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని నందనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథ నం మేరకు.. నందనం గ్రామానికి చెందిన కుమ్మర కుప్పయ్య(63) గతంలో తమిళనాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీగా పనిచేస్తుండేవాడని, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు అదే గ్రామానికి చెందిన కొందరు స్థానికులు వంకలో శవం తేలి ఉండడం గమనించి స్థానిక రెవిన్యూ సిబ్బంది వీఆర్వో సుకుమార్‌కు సమాచారం అందించారు. వీఆర్వో సమక్షంలో పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో మృతదేహాన్ని బందుమిత్రులకు అప్పగించారు. -
మీ పేరు అదే కదా అంటూ..
మేము సీబీఐ నుంచి కాల్ చేస్తున్నాం మీ పేరు అదేనా.. అంటూ వాట్సాప్‌లో 923492151434 అనే నంబరు నుంచి బుధవారం మధ్యాహ్నం తిరుపతికి చెందిన వ్యక్తికి కాల్ వచ్చింది. మీ అబ్బాయి పేరు ఇదేనా అనగానే అవును సార్ ఏమైందని కంగారుగా మాట్లాడారు. డ్రగ్స్ కేసులో మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తాం. మీ అబ్బాయి ఎక్కడున్నాడు ? అయితే ఆయన కుమారుడు ఇంట్లో ఉండడంతో ఇదిఫేక్ కాల్‌గా గుర్తించిన ఆయన వారితో మళ్లీ ధైర్యంగా మాట్లాడగా కాల్‌ను డికై ్ౖలన్ చేశాడు. దీనిపై ఆయన సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.సీబీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్న ఫేక్ ఆఫీసర్లు -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్‌లు
● పెచ్చుమీరిన సైబర్ నేరగాళ్ల నయా మోసాలు ● పలుకుబడి ఉన్నవారే వారి టార్గెట్ ● మీ అబ్బాయి/అమ్మాయి వద్ద డ్రగ్స్ దొరికాయంటూ భయపెడతారు ● ఆపై అరెస్ట్ అంటూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ ● సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని వీడియో కాల్స్ ● కేసు నుంచి తప్పించాలంటే అమౌంట్ పంపాలంటూ బెదిరింపులు ● ఫిర్యాదు చేయడానికి జంకుతున్న బాధితులు ● జాగ్రత్తగా ఉండాలంటున్న సైబర్ క్రైం పోలీసులు పలమనేరు: నిన్న మొన్నటి వరకు ఒక పంథాలో జరిగిన సైబర్ మోసాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యవస్థలో సాధారణ నేరాల కంటే డిజిటల్ మోసాలే ఎక్కువయ్యాయి. సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్తా పంథాను ఎంచుకున్నారు. అదే డిజిటల్ అరెస్టులు. వారు సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్లనే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వారి మొబైల్ నంబర్లను సేకరించి హ్యాకర్లు బ్లాక్మెయిల్ చేసి అరెస్ట్ చేశామంటూ బెదిరిస్తున్నారు. కనీసం తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. డిజిటల్ అరెస్ట్‌లకు అంతేలేకుండా పోతోంది. కేవలం ఫోన్ కాల్తోనే మాటల్లో అరెస్ట్ చేసినట్టు భయాన్ని పుట్టిస్తూ దొరికినంత దోచేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఫేక్ కాల్స్‌తో ఇప్పటికే కొందరు లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. మీ అమ్మాయి బ్యాగులో డ్రగ్స్ అంటూ.. ఇటీవల పలమనేరుకు చెందిన భాస్కర్ కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ అక్కడ పీజీలో ఉంటోంది. వీరి తండ్రికి ఓ గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మీ అమ్మాయి ఓ పబ్‌లో స్నేహితులతో కలసి ఉండగా ఆమె బ్యాగులో డ్రగ్స్ ఉండగా పట్టుకున్నామని వెంటనే లక్ష పంపాలని కాల్ వచ్చింది. దీంతో భాస్కర్ తన భార్య మొబైల్ నుంచి కుమార్తెకు ఫోన్ చేయగా తాను ఆఫీసులో ఉన్నానంటూ సమాధానం వచ్చింది. అయితే ఆయనకు మళ్లీ అదే నంబరు నుంచి ఫోన్ రావడంతో తాము పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వారమని ఇంగ్లిషులో గట్టిగా మాట్లాడడంతో ఫోన్ కట్ అయింది. ఆపై ఆ సెల్ నంబర్ స్విచ్ఆఫ్ అయింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి. కొందరు భయపడి డబ్బును ట్రాన్స్ఫర్ చేసి ఆపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా మౌనం వహిస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్‌కు భయపడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కొంపముంచుతున్న కేవైసీ.. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఖాతా నంబరు, సెల్‌ఫోన్ నంబర్లతో కేవైసీ చేస్తుంటాం. అయితే ఈ వివరాలు ఆదాయపు పన్నుశాఖకు వెళ్తుంటాయి. ఈ మొత్తం సమాచారం ఇన్సెట్ అయి ఉండడంతో హ్యాకర్లకు డేటాను దొంగిలించేందుకు మంచిమార్గం దొరికినట్టుగా అనుమానం ఉంది. ఇందుకు ప్రైవేట్ సెల్ నెట్వర్క్ నుంచి సైతం లీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా మోసగాళ్లు మన స్మార్ట్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి ఎవరు ఎక్కడున్నారనే విషయాన్ని సైతం చెప్పగలరు. ఆపై పలు రకాలుగా మోసాలు చేస్తూ మననోటి ద్వారానే ఓటీపీలు చెప్పించి మనల్ని బురిడీ కొట్టిస్తున్నారు.వీరి మోసాలు ఎలా ఉంటాయంటే..? పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామానికి చెందిన ఓ కోటీశ్వరురాలి కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తోంది. ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఆమెకు ముంబై సీబీఐ పోలీసులంటూ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్లో యూనిఫాంలో ఉన్న పోలీస్, వెనుక పోలీస్ సింహాలు అన్నీ కనిపించడంతో నిజమైన పోలీసులే అనుకుంది. వారు కాల్ చేసి బెంగళూరులోని ఐటీ వద్ద ఉన్న మీ అపార్ట్మెంట్ రూమ్‌నెం.304కు ఓ పార్శిల్ వచ్చిందని అందులో బ్రౌన్ షుగర్ ఉందని..అందుకే మిమ్మల్లి డిజిటల్ అరెస్ట్ చేశామంటూ చెప్పారు. మీరు అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలంటే వెంటనే రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించారు. అయితే ఆమె తనవద్ద డబ్బులేదని చెప్పింది. ఫలానా బ్యాంకు ఖాతాలో మీ ఎఫ్డీలో రూ.2 కోట్లు ఉన్నాయని చెప్పడంతో ఖంగు తిన్న ఆమె వెంటనే రూ.6లక్షలను వారు చెప్పిన నంబర్లుకు గూగూల్‌పే, ఫోన్‌పే, ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేసింది. తాను మోసపోయానని రెండురోజుల తర్వాత తెలుసుకున్న బాధితురాలు బెంగళూరు సైబర్‌క్రైమ్‌కు పిర్యాదు చేసింది. అసలు నంబర్లు ఎలా తీసుకుంటున్నారో..! సైబర్ నేరగాళ్లకు మన ఫోన్‌నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఎలా చేరుతుందనే విషయం పోలీసులకు సైతం అర్థం కావడం లేదు. నేరస్తులు ఫోన్ చేసి తాము సీబీఐ, నార్కోటిక్స్, ఎకై ్సజ్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లాంటి శాఖలను వాడుకుంటూ వారి ఫేసుబుక్ ఖాతాల్లో పోలీసుల ఫేక్ ఫొటోలను పెట్టి పిల్లల పేరు, ఎక్కడ చదువుతున్నారు ? ఏ దేశం, ఏ ప్రాంతం ఇలాంటి వివరాలను ఎలా చెబుతున్నారన్నది అసలు అర్థం కావడం లేదు. హ్యాకర్లు చెప్పే మాటలు నిజాలు కావడంతో పేరెంట్స్ సైతం నమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇంటర్నేషనల్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కల్చరల్: ప్రొఫెసర్ పీసీ.మహలనోబిస్ జ్ఞాపకార్థం ప్రదానం చేసే స్టాటిస్టిక్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ సీఈఓ కె.మోహన్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2025 ఏడాదికి ఈ అంతర్జాతీయ అవార్డును ప్రముఖ గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసం, ఉత్తమ గణాంక పద్ధతుల ప్రమోషన్లో గణనీయమైన కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశానికి చెందిన ఒక గణాంక నిపుణుడికి ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నారు. అవార్డు కింద రూ.10వేలు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నెదర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహణలో అందజేస్తారని తెలిపారు. గణాంకవేత్త, గణాంక సిద్ధాంతం, అభ్యాసంలో ప్రావీణ్యం ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నామినేషన్లను ఆన్లైన్లో https://www.isi-web.org/call-nominations- 2025 isi-mahalanobis-international-award వెబ్సైట్లో డిసెంబర్ 31వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు. ఈ అవార్డుకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.is.web.org లో వీక్షించవచ్చని తెలిపారు. ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థి అదృశ్యం కోట: తన కుమారుడు రషీద్ రెండు రోజులుగా కనిపించడం లేదని కోట ఎన్సీఆర్ నగర్‌కు చెందిన మహిళ బుధవారం కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలు ఈ నెల 18వ తేదీ పాఠశాలకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడని పేర్కొన్నారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అంతా గాలించామని ఎక్కడా ఆచూకీ లేదని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. -
ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?
ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణంలో జాప్యం.. గృహనిర్మాణశాఖా మంత్రి కొలుసు పార్థసారథి నవంబర్ 9వ తేదీన స్వయంగా అన్నమాట ఇది. ఇ టీవల కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమా వేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరతతోనే ఇంటి నిర్మాణా లు జాప్యం చోటుచేసుకుందని వెల్లడించారు. జిల్లా లో వారం రోజుల్లో ఇసుక సమస్య లేకుండా చేస్తా మని జిల్లాధికారులు మాట ఇచ్చారని చెప్పారు. అయినా ఇంకా ఇసుక కొరత కొనసాగుతోంది.గతం కంటే గొప్పగా చేస్తామన్నారు.. పథకం పేరు మార్చారు.. ఇళ్లు మంజూరు చేశారు.. ఇసుక ఉచితం అన్నారు.. అయినా ఇవ్వలేకపో యారు.. తిరివి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. నేటికీ వారికి సైఖతం కొరత తీర్చలేకపోయారు. ఫలితంగా పక్కా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు.. ఫలితంగా ఇల్లెప్పుడు పూర్తవుతుందోనని పేదలు నిరీక్షిస్తున్నారు. ఇదీ జిల్లాలో ఇసుక, ఇళ్ల నిర్మాణ దుస్థితి. తిరుపతి అర్బన్:ఇసుక కొరతతో ఎన్టీఆర్ పక్కా గృహా ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఫలితంగా పేదల సొంతింటి కల స్వప్నంగానే మారుతోంది. ఇసుక ఉచితం అంటూ జూలై 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ నీరుగారిపోయింది. ప్రారంభం నుంచి ఇసుక కొరత తప్పలేదు. ఉచితం కోసం జిల్లాలో నాలు గు ఇసుక పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న ఇసుకను కూటమి నేతలు కొల్లగొట్టి, ఆ ఇసుక పా యింట్లు మాసివేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగింది. ఉచితం కాదు..ధర దడే కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఇసుక యార్డ్‌లను నిర్వహించడానికి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ నేతృత్వంలో టెండర్లు ఖరారు చేశారు. జిల్లాలో మూడు ఇసుక యార్డ్‌లను నిర్వహణకు ముగ్గురు వ్యాపారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. మరో ఐదు రోజుల లోపు వీరు ఇసుకను తమకు కేటాయించిన యార్డ్‌ల్లో అందుబాటుల్లో ఉంచాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆ దేశించారు. ఇవన్నీ తిరుపతితోపాటు సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన దూర ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి రావడానికి రవాణా చార్జీల మోత తప్పేలా లేదు. ముందే టన్ను ధర రూ.640 నుంచి రూ.675కు రవాణా చార్జీలతో కలుపుకుంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ● తిరుపతి కాటన్ మిల్ వద్ద ఇసుక యార్డ్‌ను నిర్వహించడానికి శ్రీనివాసులురెడ్డికి అవకాశం ల భించింది. అన్నమయ్య జిల్లా నుంచి తెచ్చుకుని ట న్ను ఇసుక రూ. 640కు విక్రయించాలి. ● తిరుపతి రూరల్ అవిలాల వద్ద ఇసుక యా ర్డ్ పి.శైలజకి దక్కింది. ఆమె అన్నమయ్య జిల్లా నుంచి తెచ్చి అవిలాల వద్ద టన్ను రూ.640కు విక్రయించాలి. ● రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద కే. శ్రీనివాసులుకు ఇసుక యార్డ్ దక్కింది. అన్నమయ్య జిల్లా నుంచి ఇసుకను తెచ్చుకుని టన్ను రూ. 675కు విక్రయించాల్సి ఉంటుంది. పేదల ఆవేదన పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇసుక గండం ముందుకు సాగని గృహ నిర్మాణాలు నత్తనడకన ఎన్టీఆర్ గృహాలు కూటమి సర్కార్‌లో... గత జూన్‌లో రాష్ట్రంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. జగనన్న అందరికీ ఇళ్ల పథకాన్ని ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంగా పేరు మార్పు చేసింది. ఆ తర్వాత ఇసుక కొరత ఏర్పడింది. పచ్చనేతలు ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగించడంతో సామాన్యులకు ఇసుక భారంగా మారింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలలపాటు ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్ట్ బాధ్యతలు తమకు అప్పగించాలంటూ టీడీపీ కూటమి నేతలు రచ్చరచ్చ చేశారు. దీంతో అప్పటి కాంట్రాక్టర్లు తమకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లిస్తే తాము తప్పుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ల సమస్యలకు పరిష్కారం చూపించారు. ఆ తర్వాత ఇసుక సమస్యతో ఇళ్ల నిర్మాణాలు తూతూమంత్రంగా సాగుతున్నా యి. జూన్ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు చూస్తే కేవలం 1,149 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అందుకు రూ.6.35 కోట్ల నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ సర్కార్‌లో... గత సర్కార్‌లో జిల్లా వ్యాప్తంగా 575 జగనన్న లే అవుట్లలో అందరికీ ఇళ్లు పథకంలో 77,756 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు మంజూరు చేశారు.2022 మే నుంచి 2024 మే వరకు( రెండేళ్ల వ్యవధిలో) నెలకు వెయ్యి వంతున 24,618 ఇళ్లు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించారు. అందుకు రూ.792.52 కోట్లు బిల్లులు ఈ ఏడాది మే 31 నాటికి విడుదల చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. అంతేకాకుండా జగనన్న లేఅవుట్లలో విద్యుత్, రోడ్లు, తాగునీరు తదితర వసతులు కల్పించారు. 2025 మార్చి 31వ తేదీ నాటికి వందశాతం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 774 పంచాయతీలతోపాటు 575 జగనన్న లేఅవుట్లు పూర్తి అయితే అదనంగా మరో 575 పంచాయతీలు ఏర్పడతాయని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో ఇంతలోనే ప్రభుత్వం మారింది. దీంతో ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఇసుక కొరత ఉంది ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఉంది. దాంతోనే ఇంటి నిర్మాణాల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. జిల్లాలో 77,765 ఇళ్ల్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు మొత్తంగా 25,765 ఇళ్లు పూర్తి చేశాం. 2,463 ఇళ్లు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. త్వరలో వాటి ని ర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో సాగుతున్నాయి. ఈ జూన్ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు 1,148 ఇళ్లు పూర్తి చేశాం. రూ.6.35 కోట్లు నిధులు విడుదల చేశాం. గతంలో 24,618 ఇళ్లు పూర్తి చేశారు. మిగిలిన అన్ని ఇళ్లు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. – శ్రీనివాసులు, గృహనిర్మాణశాఖ, పీడీ, తిరుపతి జిల్లా -
మత్స్యకారులపై కూటమి సర్కారు శీతకన్ను
చిల్లకూరు: సముద్రంలో చేపల వేటతో జీవనం సాగించే నిరుపేద మత్స్యకారులకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించింది. మత్స్యకారులను ఆదుకోలేమంటూ చేతులెత్తేసింది. ఎన్నికల సమయంలో వేట విరామ పరిహారం రెండింతలు చేస్తామని ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం వేట విరామ పరిహారం ఏడాదికి రూ.10 వేలు చొప్పన ఇస్తుండగా కూటమి నాయకులు దానిని రూ.20 వేలు చేసి, అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నేటికి ఆరు నెలలు దాటుతున్నా ఆ ఊసే ఎత్తడంలేదు. 2014–19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక బోటు ఉన్న మత్స్యకారుడుకి రూ.4 వేలు పరిహారం ఇచ్చేది. అది కూడా రెండేళ్లకొకసారి అందించేది గగనంగా ఉండేది. అలాంటిది 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా రూ.10 వేల చొప్పున మత్స్యకారుల ఖాతాలో నగదు జమ చేశారు.జీవన శైలి ప్రత్యేకంమత్య్సకారుల జీవన శైలి విబిన్నంగా ఉంటుంది. నేడు మత్స్యకారులు కూడా జీవన విధానాలలో మార్పులు చేసుకుంటూ వస్తూ కొంత రాజకీయంగా ఎదుగుదల చెందాలని ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ మత్స్యకార గ్రామాల్లో లిపి లేని వారి భాష మాట్లాడుతుంటే విన సొంపుగా ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు కొన్ని ఆసక్తిగా ఉండడమే కాకుండా కఠినంగా కూడా ఉంటాయి. మత్స్యకార గ్రామాల్లో ఏళ్ల తరబడి నివసించే మత్స్యకారులు ఒకే మాట, ఒకే బాటలో నడుస్తూ కట్టుబాట్లకు కట్టుబడి ముందుకు సాగుతారు. వీరు తమ కట్టుబాట్లుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి గ్రామంలోనూ పెద్దకాపు, నడిపి కాపు, చిన్న కాపు అని ముగ్గురు మత్స్యకారులు గ్రామ కాపులుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా కట్టుబాట్లును ధిక్కరిస్తే వారికి తగిన జరిమానా కూడా విధిస్తారు. గ్రామానికి సంబంధించి భార్యభర్తల వివాదాల నుంచి గ్రామ సమస్యల వరకు పరిష్కరించుకునేందుకు వీరు కాపుల మాటే వేదంగా భావిస్తారు. విరామం సమయంలో సముద్రం మీదకు వేటకు వెళ్లినా, గ్రామ నిబంధనలు ధిక్కరించినా.. గ్రామ కాపుల ముందు పంచాయితీ పెడతారు. వారు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని శిరసావహిస్తూ కచ్చితంగా అనుసరించాల్సి ఉంది. అలా కాకుండా కట్టుబాట్లును ధిక్కరించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సమస్యనూ గ్రామం దాటి పోలీస్టేషన్లకు వెళ్లన్వికుండా అక్కడే పరిష్కరించుకునేలా చూసుకుంటారు. ఇలా జరిమానా ద్వారా వచ్చిన సొమ్మును కాపులు గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు.పరిహారం ఊసే లేదుఎన్నికల సమయంలో మ త్స్యకారులకు వేట విరా మ సమయంలో అందించే పరిహరంను ఇప్పటి వరకు అందివ్వలేదు. గతంలో కన్నా రెండింతలు అదికంగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వేట విరామ సమయంలో పనులు లేకుండా ఉన్నప్పటికి ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకంగా ఉన్నాం, నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. గతంలో అదికారంలో ఉన్నప్పడు కూడా సక్రమంగా వేట విరామ పరిహారం ఇచ్చందిలేదు. –పోలయ్య, మత్స్యకారుడు, కొండూరుపాళెం, వాకాడు మండలంఎలా బతకాలి?ఎన్నికలప్పుడు కూటమి నేతలు మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఒకటీ నె రవేర్చడంలేదు. సముద్రం పై వేట వెళ్లే మాకు ఏడాదికి ఒకసారి మత్స్యకార భరోసా ఇచ్చేందుకు ఇంత కష్టమా?.. బోటు యజమానులకు డీజిల్ రాయితీ కూడా అమలు చేయక పోతే మత్స్యకారులు ఎలా బతకాలి. –శివకుమార్, మత్స్యకారుడు, ఇరకం, తడ మండలంమూడు నెలలుగా వేట సక్రమంగా సాగలేదుసముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టుకుని ఏ పూటకు ఆ పూట కుటుంబాలను పోషించుకునే వారం. అయితే గత మూ డు నెలలుగా సముద్రంలో తుపాను అలజడి కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీంతో వేటకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. ఇలా ప్రతి 15 రోజల కొకసారి మూడు రోజలు పాటు వేటకు దూరంగా పస్తులతో కాలం గడుపుతున్నాం.– మేకల నాగరాజు,మత్స్యకారుడు, మోమిడి, చిల్లకూరు మండలంగతంలో నవరత్నాలతో వెలుగులురాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలు తీరప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి. 2014లోని సర్కారు చేపల వేటకు ఉపయోగించే బోట్లకు డీజిల్ లీటరుకు రూ.6.03 సబ్సిడీ ఇవ్వగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత దాన్ని రూ.9 చేశారు. ఒక్కొక్క బోటుకు నెలకు రాయితీపై 300 లీటర్లు డీజిల్ అందజేశారు. ఆ మేరకు ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్ తీసుకునే అవకాశం కల్పించారు. అలాగే చేపలవేట నిషేధ కాలంలో 2014కు ముందున్న ప్రభుత్వాలు మత్స్యకారులకు రూ.4 వేలు భృతిని ఇస్తుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచారు. వేట సమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను రూ.10 లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలకు పెంచారు. దీంతో తీరప్రాంత మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే నేటి ప్రభుత్వం వాటికి చెల్లు చీటీ పాడింది. ఫలితంగా మత్స్యకారులు ఇక్కట్లు పడుతున్నారు.కూటమి ప్రభుత్వంలో అందని భరోసాఎన్నికల సమయంలో మత్స్యకారులపై అమితమైన ప్రేమను ఒలకబోసిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంపై నెపం మోపుతూ మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇవ్వాల్సిన రూ.10 వేల పరిహారం(మత్స్యకార భరోసా) ఇచ్చేందుకు కూటమి నాయకులు మోకాలు అడ్డుపెట్టి తమ వద్ద నిధులు లేవని, అందువల్ల కేటాయింపులు చేయలేక పోతున్నామని పెద్దల సభలో చెప్పించడం చూస్తుంటే ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితిలో లేదని అర్థం అవుతుంది. -
పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్య
● పలు కేసుల్లో నిందితుడు ● విచారించేందుకు వెళ్లిన పోలీసులను చూసి భయపడి.. ● మృతుడు విజయవాడ వాసి తిరుచానూరు (చంద్రగిరి) : పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఓ యువకుడిని విచారించే నిమిత్తం తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని వేదాంతపురం గ్రామానికి వెళ్లిన ఏలూరు జిల్లా పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోలీసులను చూసి భయపడిన నిందితుడు బుధవారం వేకువజామున తన ఇంట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబం, పోలీసుల కథనం మేరకు.. విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన నీలం సూర్యప్రభాస్ (21)పై వైజాగ్, మాచవరం, కర్నూలు, సూర్యపేట, పెనమలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి దాదాపు 15 కేసులున్నాయి. అతడికి భార్య హారిక, కుమారుడు ఉన్నాడు. కులాంతర వివాహం చేసుకున్న సూర్యప్రభాస్ మూడు నెలల క్రితం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లి జీవిస్తున్నాడు. హారిక బాలికగా ఉన్న సమయంలో ప్రేమించడంతో సూర్యప్రభాస్పై పోక్సో కేసు పెట్టగా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. భవన నిర్మాణ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పలు కేసుల్లో అతను నిందితుడిగా ఉన్న నేపథ్యంలో విచారణ నిమిత్తం ఏలూరు జిల్లా లక్కవరం ఎస్ఐ రామకృష్ణ, జంగారెడ్డి గూడెం క్రైం ఏఎస్ఐ సంపత్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సూర్యప్రభాస్ కోసం గాలిస్తూ మంగళవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి వెళ్లారు. సూర్యప్రభాస్ ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరగా.. పోలీస్‌స్టేషన్‌కు రానని చెప్పాడు. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి పోలీసులు సూర్యప్రభాస్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో చుట్టు పక్కల వారిని విచారించారు. ఇంటికి ఎప్పుడూ తాళాలు వేసి, వారు లోపల ఉంటారని చెప్పారు. అనుమానంతోనే విచారణ చేస్తున్నామనీ, ఒక్కసారి రావాలని పోలీసులు పదేపదే కోరారు. అయితే ఇంటి బయట పోలీసులను చూసి భయపడిన సూర్యప్రభాస్ బుధవారం వేకువజామున ఇంట్లో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పుటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బయట నుంచి ఇంటి తలుపులు పగులగొట్టి అతని భార్య, కుమారుడిని కాపాడి.. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల ఒత్తిడే కారణమా? పోలీసులు విచారణకు రావాలంటూ ఒత్తిడి చేయడంతో బట్టలు మార్చుకుని వస్తానంటూ చెప్పిన సూర్యప్రభాస్ పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్యహత్యకు పాల్పడగా.. పోలీసుల నిర్వాకంతోనే ఇలా జరిగిందంటూ గ్రామంలోని ప్రజలు తిరగబడ్డారు. నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సూర్యప్రభాస్ భార్య, కుటుంబ సభ్యులతో మాట్లా డి సెటిల్మెంట్ చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు లేకుంటే తాము కూడా మంటలు అంటుకుని కాలిపోయేవారమని మృతుడి భార్య హారిక చెప్పడం విశేషం. -
మత్స్యకారుల బతుకుపోరాటం
కడలి అలలపైన.. వలల మాటున.. పొట్టకూటికి నిత్యం తిప్పలు తప్పని జీవితం. బతుకు తీరం దాటేందుకు సముద్రంలో సుదూరం పయనం. ఇంత సాహసించినా బతుకు ఒడ్డున పడడంపై అపనమ్మకం. మరు ఘడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని వైనం. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకంతో బతుకుపోరాటం. ఇలా ఆటుపోట్ల నడుమ జీవనం సాగిస్తున్నా అందని సర్కారు ప్రోత్సాహం.. కడలే ఆధారం. వెరసి.. కష్టాల సుడిలో జీవనం. ఇదీ మత్స్యకారుల బతుకుపోరాటం. నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
ఘనంగా జోనల్ క్రీడలు ప్రారంభం
కోట: బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల జోనల్ క్రీడాపోటీలు కోటలో ఘనంగా ప్రారంభమయ్యా యి. ఎస్సీ గురుకులాల సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ బుధవారం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించి, గౌరవ వందనం స్వీకరించారు. 75 అడుగుల పొడవు ఉన్న జాతీయజెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు. 17 పాఠశాలలు, కళాశాలల నుంచి 650 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. డీసీఓలు జయలక్ష్మి, జయశ్రీ,కోట ఎంపీపీ అంజమ్మ, జెడ్పీటీసీ కోటయ్య పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. ● పాఠశాల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో నరేంద్ర (కురిచేడు, ప్రకాశంజిల్లా) ప్రఽథమస్థానం, నితీష్ సంజయ్(చిల్లకూరు) ద్వితీయస్థానం, తిరుపతయ్య(నాయుడుపేట) తృతీయస్థానం సాధించారు. ● 800 మీటర్ల రన్నింగ్ రేస్‌లో సాయినికేతన్(కోట) ప్రథమ, కోటేశ్వరయ్య(చిల్లకూరు) ద్వితీ య, నవీన్‌కుమార్(కోట) తృతీయస్థానం ద క్కించుకున్నారు. ● 1500 మీటర్ల రన్నింగ్‌లో నవీన్‌కుమార్(కోట)ప్రథ మ, సాయినికేతన్(కోట) ద్వితీయ, కోటేశ్వరయ్య(చిల్లకూరు) తృతీయస్థానం కై వసం చేసుకున్నారు. ● షాట్‌పుట్‌లో నితీష్సంజయ్(చిల్లకూరు) ప్రథ మ, దిలీప్(వాకాడు)ద్వితీయ, ఫణీంధ్ర(సత్తెనపల్లి) తృతీయస్థానాల్లో నిలిచారు. కళాశాల విభాగం.. ● 100 మీటర్ల రన్నింగ్ రేస్‌లో సుబ్రమణ్యం(వాకాడు) ప్రథమ స్థానం, సతీష్(నాయుడుపేట) ద్వితీయ స్థానం, హేమంత్‌కుమార్(వాకాడు) తృతీయస్థానం సాధించారు. ● 800మీటర్లు.. శివయ్య(కోట) ప్రథమ, ధనుష్ (వాకాడు) ద్వితీయ, రాహుల్(చిల్లకూరు) తృతీయస్థానం దక్కించుకున్నారు. ● 1500 మీటర్లు.. శివయ్య(కోట) ప్రథమ, రాహుల్(చిల్లకూరు)ద్వితీయ,సాగర్(అచ్చంపేట)తృతీయస్థానం కై వసం చేసుకున్నారు. ● షాట్‌పుట్‌లో యశ్వంత్(చిల్లకూరు) ప్రధమ, చైతన్య(వెలుగొండ)ద్వితీయ, మదన్మోహన్(కారంపూడి) తృతీయస్థానం చేజిక్కించుకున్నారు. -
పులికాట్‌కు విదేశీ విహారి
● ఆహార వేటలో వలస పక్షుల విన్యాసాలు పులికాట్.. అందాల హరివిల్లు.. ఆ ప్రకృతి సొయగాలకు విదేశీ వలస విహంగాలు వచ్చి చేరడంతో మరిన్ని హంగులు చేకూరాయి. సరస్సు అలలపై మల్లెలు తేలియాడుతున్న భావన కలుగుతోంది. పక్షులు ఆహార వేట అబ్బుర పరుస్తోంది. సూళ్లూరుపేట: పులికాట్ సరస్సు జలకళను సంతరించుకోవడంతో విదేశీ వలస విహంగాలు వచ్చి చేరి, పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి శీతాలకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసి నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట లాంటి ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తిని చేసుకుని వెళుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాలోని ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్‌గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్‌గా ఉపయోగించుకుని వెళుతున్నాయి. అందుకే విదేశీ వలస విహంగాలకు ఈ ప్రాంతం మెట్టినిల్లుగా పేరుగాంచింది. ఈ ప్రాంతానికి ఫ్లెమింగోలు, గూడ భాతులు, సముద్రపు పావురాయిలు, ఏర్రకాళ్ల కొంగలు, నత్తగుల్ల కొంగలు, నీటి కాకులు, స్వాతి కొంగలు, పరజలు, పలు రకాల బాతులు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. సూర్యోదయం వేళలో మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయ భానుడు ప్రకాశించే సమయంలో ఈ వలస విహంగాల ఆకాశంలో విహరిస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రియులను పులకరింపజేస్తున్నాయి. -
TTD: సాధారణంగానే కొనసాగుతున్న తిరుమల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న ( మంగళవారం) 62,248 మంది స్వామివారిని దర్శించుకోగా 18,852మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.71 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాసుక్కూర్చున్నారు!
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో సబ్రిజిస్ట్రార్ల్ల తీరును తప్పుపడుతున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంకను చూపి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేవలం కాసుల కోసమే సాకులు చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు అడిగింది ఇచ్చేస్తే వెంటనే పని అయిపోతోందని వెల్లడిస్తున్నారు. అయితే వారు చెప్పింది ఇస్తే అలాంటి ఇబ్బందులు తప్పుతున్నాయి. జిల్లాల పునర్విభజన నాటి నుంచి తిరుపతి జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరుగా సాగుతున్నాయి. అందుకు తోడు తాజాగా వచ్చే డిసెంబర్ నుంచే భూముల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెంచుతున్నారని పత్రికల్లో వస్తున్న కథనాలపై క్రయవిక్రయదారులు ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. జిల్లాలో 12 సబ్‌రిజిస్టర్ కార్యాలయాలున్నాయి. ఏడాదిలో వివిధ అంశాలకు సంబంధించి లక్షకుపైగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఏటా రాబడి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేరకు వస్తోంది. 2020–21 ఈ రెండేళ్లు మాత్రమే కోవిడ్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల జోరు తగ్గింది. జిల్లాలో ప్రధానంగా తిరుపతి, రేణిగుంట, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, గూడూరు, చంద్రగిరి, వెంకటగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా ఈ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని కార్యాలయాల్లోను సీసీ కెమెరాలు అమర్చారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా అడ్డగోలు పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మారుతున్నాయని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచావతారులు పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ వంకలు పెడుతున్న ఉద్యోగులు హల్చల్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు తిరుపతిలో ఇక్కట్లు అధికం తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రోజురోజుకు కష్టంగా మారుతోందని పలువురు కొనుగోలుదారులు వాపోతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నప్పటికీ పక్కన పెట్టేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో రోజుకు 200 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవని, అయితే ప్రస్తుతం 20 నుంచి 30 మాత్రమే పూర్తవుతున్నాయని వెల్లడిస్తున్నారు. తిరుపతిలో ఇద్దరు సబ్ రిజిసా్ట్రర్లు ఉన్నప్పటికీ పనుల్లో జోరు లేదని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రెండు మూరు రోజులపాటు కార్యాలయానికి తిరగాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మరోవైపు రాత్రి పది గంటల వరకు ఉద్యోగులు కార్యాలయంలోనే ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ల వ్యవహారం పూర్తి అయినప్పటికీ రాత్రి వేళల్లో కూడా అక్కడే ఉండడమేంటని చర్చించుకుంటున్నారు.. అలాగే ప్రైవేటు వ్యక్తుల దందా కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల బాధ్యతలను వీరే చేపట్టినట్లు సమాచారం. -
ఏటీఎంలో చోరీకి యత్నం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాసు రోడ్డు వద్ద ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు చోరీకి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. ముఖానికి ప్లాస్టీక్ కవర్ పెట్టుకుని ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అతని వద్ద ఉన్న భారీ గునపంతో ఏటీఎంను పగులగొట్టాడు. ఏటీఎం ముందు భాగంలో ఉన్న వాటిని ఽగునపంతో ధ్వంసం చేశాడు. చివరగా నగదు ఉన్న కౌంటర్‌ను పగులగొట్టే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా సైరన్ మోగడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు రోజే ఏటీఎంలో భారీగా నగదు పెట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. మంగళవారం జిల్లా క్లూస్‌టీం ఎస్ఐతో పాటు ఐడీ పోలీసులచేత నిశితంగా పరిశీలించినట్టు వెల్లడించారు. ఆయన వెంట ఎస్ఐ శ్రీహరబాబు ఉన్నారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్మెంట్ మాత్రమే నిండింది. సోమవారం అర్ధరాత్రి వరకు 62,085 మంది స్వామివారిని దర్శించుకోగా 21,335 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పురుగులొస్తున్నాయ్ లోకేషన్నా!
తిరుపతి సిటీ: ‘రాష్ట్ర విద్యా, ఐటీ శాఖా మంత్రి వర్యులు నారా లోకేష్గారికి మేం ఒక్కటే విన్నవించ దల్చుకున్నాం. మేం తినే అన్నం, కూరలు చాలా నాసిరకంగా ఉన్నాయి. తరచూ పురుగులు వస్తున్నాయి. దయ చేసి నాణ్యమైన ఆహారం పెట్టే విధంగా చర్యలు చేపట్టండి’ అంటూ తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ట్విటర్, ఈమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్‌ల ద్వారా వర్సిటీలోని వసతిగృహాల దయనీయ స్థితిని మంత్రికి నేరుగా ఫిర్యాదు చేశారు. గతంలోనూ హాస్టల్స్‌లో భోజన వసతులపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా విద్యార్థులే మంత్రికి ఫిర్యాదు చేశారు. నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు. అధికారులు, హాస్టల్ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.పొంగలిలో పురుగు పడ్డా పట్టించుకోలేదుమహిళా వర్సిటీలోని అంజీరా బ్లాక్ వసతి గృహంలో గత శనివారం ఉదయం వడ్డించిన పొంగలిలో పురుగులు పడ్డాయి. ఆదే విషయాన్ని హాస్టల్ సిబ్బందికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. తమ నోరు నొక్కి విషయాన్ని బయటకు పొక్కకుండా అణచివేశారు. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ. 4వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయినా నాణ్యమైన ఆహారాన్ని పెట్టడం లేదు. విద్యార్థినులు చాలా మంది హాస్టల్ భోజనంపై విరక్తి చెంది క్యాంటీన్లో, బయట నుంచి ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు.– విద్యార్థినులు, మహిళా వర్సిటీనాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాంమహిళా వర్సిటీ హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం. పొంగలిలో పురుగు వచ్చిందన్న విషయంపై మాకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఓ విద్యార్థిని రాష్ట్ర మంత్రికి మెసేజ్ ద్వారా ఫిర్యాదు పంపిందని వార్తలు రాగానే విచారణ చేపట్టాం. ఆహారంలో పురగులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణులు అవాస్తవమని తేలింది.– ప్రొఫెసర్ వీ.ఉమ,ఇన్చార్జి వీసీ, మహిళావర్సిటీవిచారకరంమహిళా వర్సిటీలోని వసతిగృహాలలో మౌలిక వసతులు, నాణ్యమైన భోజనంపై ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్సీపీ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ వంటి ఐక్య విద్యార్థి సంఘాలు అధికారులను కలసి పలు మార్లు వినతి పత్రాలు అందించాం. కానీ తీరు మారకపోవడం విచారకరం. ఇప్పటికై నా విద్యార్థినుల వసతి గృహాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి నాణ్యమైన ఆహారం అందించాలి. లేకుంటే నిరసనలు, ధర్నాలతో కదం తొక్కుతాం.–విద్యార్థి సంఘాల ఐక్య వేదిక, తిరుపతి -
కాలువలో పడి వ్యక్తి మృతి
గూడూరు రూరల్: గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి నీటి కాలువలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ మనోజ్‌కుమార్ కథనం.. గ్రామానికి చెందిన కటకం సుబ్రహ్మణ్యం (50) కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాడు. పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను గ్రామ సమీపంలో ఉన్న నీటి కాలువ గట్టున పశువులు మేపే సమయంలో అతనికి పిట్స్ వచ్చి నీటిలో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్‌లకు తెలియజేశారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. నేడు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం లక్ష బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ అలంకార మండపంలో జరిగే ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉద్యోగ నైపుణ్యతకు ప్రత్యేక శిక్షణ తిరుపతి అర్బన్: విద్యార్హతను బట్టి ఉద్యోగ నైపుణ్యత సాధించడానికి వీలుగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం తెలిపారు. జీఎన్ఎం మూడేళ్లు, బీఎస్సీ నర్సింగ్ రెండేళ్లు చదువుకున్న వారిని జర్మనీ దేశానికి పంపడానికి ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. స్విమ్స్ నర్సింగ్ కళాశాల వద్ద శిక్షణ ఉంటుందన్నారు. జర్మనీ భాషను సైతం నేర్పిస్తారని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచితంగా భోజన వసతులు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటాతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, అనుభవ సర్టిఫికెట్, వివాహ ధ్రువీకరణ పత్రం, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్ తదితర వాటిని సమర్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని, డిసెంబర్ 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. సమాచారం కోసం 91 60912690లో సంప్రదించాలని సూచించారు. -
అదరం.. బెదరం
శ్రీరంగరాజపురం: టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు, బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లో బెదరమని, వైఎస్పార్ సీపీ శ్రేణులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. శ్రీరంగరాజుపురం మండలం కొత్తపల్లిమిట్ట గ్రామంలో మంగళవారం నియోజకవర్గం బూత్ కన్వీనర్ నారాయణరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో సృష్టిస్తున్న అల్లర్లు, అరాచకాలు తార స్థాయికి చేరాయన్నారు. టీడీపీ నేతలు అధికార అహంకారంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు రోడ్డుపైకి వస్తే టీడీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. ఈ తరుణంలో జైలుకు పంపినంత మాత్రాన వైఎస్సార్సీపీలో భయపడేవారు ఎవరూ లేరని.. టీడీపీ తప్పులను ఎండగట్టడానికి సమయం దగ్గర పడిందనే విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో కార్యకర్తలంతా మమ్మల్ని జైల్లో వేయండంటూ జైల్ భరో కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. సోషియల్ మీడియా వేదికగా టీడీపీ అండ్ కో వైఎస్సార్ కుటుంబంపై చేసిన అభస్యకరమైన పోస్టులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఇక భయపెట్టి అధికారంలోకి కొనసాగాలని చూస్తే..ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు సైతం సమష్టిగా పనిచేసి చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు తాను పార్టీకి తలొగ్గి పనిచేస్తా కార్యకర్తలు పోరాట పటిమతో పనిచేయాలి టీడీపీ కుట్రలకు భయపడొద్దు వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి