Visakhapatnam
-
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
విశాఖ సిద్ధం
డాక్‌యార్డుకు మారిషస్ కోస్ట్‌గార్డ్ నౌక దేశవాళీ ధనాధన్ క్రికెట్‌కు● 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ● విశాఖతో పాటు విజయనగరంలో మ్యాచ్‌లు ● విశాఖ చేరుకున్న టీ–20 జట్లు విశాఖ స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పేరిట జరగనున్న దేశవాళీ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల కోసం జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. మొత్తం 38 జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి తలపడనున్న ఈ టోర్నీలో గ్రూప్ డీ మ్యాచ్‌లు విశాఖపట్నం, విజయనగరం వేదికగా జరగనున్నాయి. డీ, ఈ గ్రూప్‌ల్లో ఏడేసి జట్లు.. ఏ, బీ, సీ గ్రూప్‌ల్లో ఎనిమిదేసి జట్లు గ్రూప్ స్టేజ్‌లో పోటీపడనున్నాయి. పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రోజూ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 4.30 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. విజయనగరంలోని పి.వి.జి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రూప్ డీలో అసోం, రైల్వేస్, చండీగఢ్, పుదుచ్చేరి, విదర్భ, ఒడిశా, చత్తీస్‌గఢ్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ స్టేజ్ పోటీలు ఈ నెల 23 నుంచి ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తాయి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు డిసెంబర్ 9 నుంచి ప్రీ–క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్‌లో పోటీపడతాయి. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఈ సందర్భంగా ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ గ్రూప్ డీలో తలపడే అన్ని జట్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇక ఆంధ్రా జట్టు గ్రూప్ ‘ఈ’లో హైదరాబాద్ వేదికగా ఆడనుంది. 25న నాగాలాండ్, 27న గోవా, 29న మహారాష్ట్ర, డిసెంబర్ 1న సర్వీసెస్, 3న కేరళ, 5న ముంబయి జట్లతో ఆంధ్రా జట్టు తలపడనుంది. విశాఖ సిటీ: మారిషస్ కోస్ట్‌గార్డు నౌక ఎంసీజీఎస్ వాలియంట్ విశాఖ నేవల్ డాక్‌యార్డుకు వచ్చింది. ఈ సందర్భంగా నేవీ అధికారులు మారిషస్ అధికారులు, సిబ్బందికి స్వాగతం పలికారు. సాగర్ కార్యక్రమంలో భాగంగా మారిషస్ నౌకకు ఇక్కడ మూడున్నర నెలల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. -
వాతావరణ మార్పులపై ప్రత్యేక కార్యాచరణ
కొమ్మాది: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే యువతలో భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారని, అయితే వీసా కోసం దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం కాన్సులర్ ఇన్ఫర్మేషన్ యూనిట్ విభాగాధిపతి ఎస్.జెన్నె సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికాలో ఉన్నత చదువులకు వీసా పొందే విధానంపై ఆమె అవగాహన కల్పించారు. అమెరికాలో 4,500 గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయని, వీటిలో ప్రవేశానికి ఆసక్తి గలవారు తమ కాన్సులేట్ కార్యాలయంలో ఎఫ్–1 విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వీసా పొందాలనుకుంటే భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశానికి శాశ్వతంగా మార్గాలు మూసుకుపోయినట్లేనని హెచ్చరించారు. ● మేయర్ గొలగాని హరివెంకటకుమారి డాబాగార్డెన్స్: ప్రపంచ వ్యాప్తంగా నగరాల్లో గణనీయంగా వాతావరణం మార్పులు చెంది ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. విశాఖ నగరంలో వాతావరణం మార్పులకు అనుగుణంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఐసీఎల్ఈఐ ఆర్గనైజేషన్ క్లైమేట్ యాక్షన్‌పై సిటీస్ ప్లానింగ్, ఆచరణ అనే అంశంపై మంగళవారం వర్క్‌షాపు జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. నగరం ఇప్పటికే పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో ముందంజలో ఉందన్నారు. జీవీఎంసీ 13 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, బీచ్‌రోడ్డులో 3 వేల సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసిందన్నారు. విశాఖలో 28 శాతం గ్రీన్ కవర్ ఉందని, మరింత పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పా రు. బీచ్‌రోడ్డులో ప్రజా రవాణా కోసం ఉచితంగా ఈ–ఆటోలు నడుపుతున్నామని, ఇంటింటా చెత్త సేకరణకు 65 ఈ–ఆటోలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విశాఖ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్‌ను జీవీఎంసీ ఎస్ఆర్యూ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. అర్బన్‌లో కార్బన్ మొబిలిటీ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుపై అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మియా వాకీ అర్బన్ ఫారెస్ట్‌పై ఉదయపూర్ మున్సిపల్ కార్పొరేషన్, క్లైమేట్ యాక్షన్ ఎర్లీ వార్నింగ్ సిస్టం ఫర్ అర్బన్ ప్లడింగ్ ప్రాజెక్టుపై తమిళనాడు తిరునల్వేలి ప్రతినిధులు మాట్లాడారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాద్‌రాజు, ఐసీఎల్ఈఐ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఈమని కుమార్, ప్రొఫెసర్ ఎస్.రామకృష్ణారావు, విజయవాడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్‌బాబు పలు అంశాలను చర్చించారు. విజయవాడ అదనపు కమిషనర్ చంద్రశేఖరరావు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వారా రవీంద్ర పాల్గొన్నారు. -
● లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్ఎం సౌరభ్ కుమార్ ● వ్యవస్థను సౌరభ్ నిర్వీర్యం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు ● పోస్ట్ ఖాళీ అయినా విశాఖ వచ్చేందుకు జంకుతున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఏడాదిన్నర కిందట వరకు రైల్వే వ్యవస్థలో వెలుగు వెలిగిన వాల్తేరు డివిజన్‌కు చీకటి రోజులు దాపురించాయి. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సౌరభ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కుంటుపడింది. తన స్వలాభం కోసం మాత్రమే సౌరభ్ పనిచేశారన్న విషయం సీబీఐ దాడులతో సుస్పష్టమైంది. చేయి తడిపితేనే పనులకు పచ్చజెండా ఊపుతామన్న రీతిలో డీఆర్ఎం స్థాయి అధికారి వ్యవహరించడంతో.. అభివృద్ధిలో డివిజన్ వెనుకపడింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ ఈస్ట్‌కోస్ట్ జోన్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే పరువును డీఆర్ఎం సౌరభ్‌కుమార్ పట్టాలు తప్పించేశారు. సెంట్రల్ రైల్వే జోన్లో పీసీఎంఈగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన వివాదాస్పదుడిగా పేరొందారు. అక్కడి నుంచి డీఆర్ఎంగా గతేడాది జూలైలో వచ్చిన తర్వాత.. అవినీతి వ్యవహారాలను వేగవంతం చేసేశారు. డివిజన్ పరిధిలో చిన్న టెండర్ కావాలన్నా.. లంచం డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.25 వేల నుంచి రూ.కోట్ల వరకూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి పిండుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ సౌరభ్‌కుమార్ అనుచరవర్గం బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా.. ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాల్తేరు పరిధిలో పనులన్నీ నిలిచిపోయాయి. -
సమష్టి కృషితో జలవనరుల సంరక్షణ
మహారాణిపేట: జిల్లాలోని చెరువులు, సాగునీటి కాలువలు, జలధారలను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక, సమష్టి కృషి అవసరమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జలవనరుల సంరక్షణ, ఇతర అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు మార్గదర్శకాలు జారీ చేశారు. నీటి వనరుల అదనపు నిల్వ సామర్థ్యాన్ని 23 వేల క్యూబిక్ మీటర్లకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఆక్రమణలు తొలగించి, సరిహద్దులు గుర్తించాలని ఆ దేశించారు. నీటి వనరుల సంరక్షణకు ముందుకొచ్చిన ధాన్ ఫౌండేషన్‌కు సహకరించాలని సూచించారు. సమీప రైతులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని, చెరువుల ఆధునికీకరణ, తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాల న్నారు. స్థానిక పరిస్థితులు, ఆక్రమణలు, ఇతర అంశాలపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. మేహాద్రి గెడ్డ, గోస్తని నది తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆయా తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. రూ.కోటి అంచనాతో ప్రత్యేక ప్రణాళిక జిల్లాలోని మొత్తం 14 చెరువులు, 17 జలధారలు, 16 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువలు, 11 కొత్త స్లూయిజ్‌లు, మరో మూడు స్లూయిజ్‌లకు మరమ్మతులు చేపట్టేందుకు సుమారు రూ.కోటి అంచనాతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ధాన్ ఫౌండేషన్ ప్రతినిధి లోకేష్ తెలిపారు. రాంపురం, ఆటోనగర్, కొత్తపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్, ఏడీసీ రమణమూర్తి పాల్గొన్నారు. -
వాల్తేరు రైల్వే డివిజన్ అభివృద్ధి ఎక్కడ?
డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అజెండాపైనే దృష్టి సారించిన సౌరభ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ గతంలో ప్రతిపాదన చేసినవే.. ఆయన మార్కు అంటూ ఎక్కడా చూపించలేకపోయారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల విషయంలోనూ డీఆర్ఎం తన హస్తలాఘవాన్ని చూపించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన మొదలైన పనులు చేపట్టాల్సి ఉన్నా.. భారీగానే ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దువ్వాడ లాంటి స్టేషన్లో దాదాపు 50 శాతం పనులు పూర్తయినా.. వైజాగ్ రైల్వేస్టేషన్లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఉద్యోగుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 16 నెలల పాటు డీఆర్ఎంగా వెలగబెట్టిన సౌరభ్‌కుమార్.. వాల్తేరు పరువును దిగజార్చేశారు. అథఃపాతాళానికి పడిపోయిన డివిజన్‌కు కొత్త డీఆర్ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రైల్వే బోర్డు పలువురు అధికారులను సంప్రదించగా.. విముఖత చూపినట్లు సమాచారం. కాగా.. గత అనూప్ సత్పతిని మళ్లీ డీఆర్ఎంగా నియమించాలని సోషల్ మీడియా ద్వారా పలువురు రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నారు. -
వాల్తేరుకి
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● కొమ్మాది శాప్ స్టేడియం పరిశీలన క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు మధురవాడ: జిల్లాలో క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. కొమ్మాదిలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను బుధవారం ఆయన సందర్శించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడా మైదానాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇచ్చేలా అంతా కృషి చేయాలని కోచ్‌లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంనకు సంబంధించి స్థలం వివరాలపై ఆరా తీశారు. స్టేడియంను పరిశీలించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, డీఎస్డీవో జూన్ గ్యాలియెట్, శాప్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్, రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ వీసా కోసం దళారులను నమ్మకండి -
● లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్ఎం సౌరభ్ కుమార్ ● వ్యవస్థను సౌరభ్ నిర్వీర్యం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు ● పోస్ట్ ఖాళీ అయినా విశాఖ వచ్చేందుకు జంకుతున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఏడాదిన్నర కిందట వరకు రైల్వే వ్యవస్థలో వెలుగు వెలిగిన వాల్తేరు డివిజన్‌కు చీకటి రోజులు దాపురించాయి. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సౌరభ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కుంటుపడింది. తన స్వలాభం కోసం మాత్రమే సౌరభ్ పనిచేశారన్న విషయం సీబీఐ దాడులతో సుస్పష్టమైంది. చేయి తడిపితేనే పనులకు పచ్చజెండా ఊపుతామన్న రీతిలో డీఆర్ఎం స్థాయి అధికారి వ్యవహరించడంతో.. అభివృద్ధిలో డివిజన్ వెనుకపడింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ ఈస్ట్‌కోస్ట్ జోన్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే పరువును డీఆర్ఎం సౌరభ్‌కుమార్ పట్టాలు తప్పించేశారు. సెంట్రల్ రైల్వే జోన్లో పీసీఎంఈగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన వివాదాస్పదుడిగా పేరొందారు. అక్కడి నుంచి డీఆర్ఎంగా గతేడాది జూలైలో వచ్చిన తర్వాత.. అవినీతి వ్యవహారాలను వేగవంతం చేసేశారు. డివిజన్ పరిధిలో చిన్న టెండర్ కావాలన్నా.. లంచం డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.25 వేల నుంచి రూ.కోట్ల వరకూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి పిండుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ సౌరభ్‌కుమార్ అనుచరవర్గం బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా.. ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాల్తేరు పరిధిలో పనులన్నీ నిలిచిపోయాయి. -
విశాఖపట్నంలో సీవిజిల్– 2024 యుద్ధ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం : యావత్ ప్రపంచానికి దేశ రక్షణ శక్తిని చాటిచెప్పేలా సమర సన్నద్ధ ప్రదర్శన (సీవిజిల్–2024) దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. భారత నౌకాదళం, తీరగస్తీ దళం, మైరెన్ పోలీస్ వ్యవస్థలు ఉగ్రవాదులకు సవాల్ విసురుతూ.. తీర ప్రాంతంపై భారత రక్షణ దళ పట్టును ప్రదర్శించేందుకు 2018 నుంచి ఏటా రెండు రోజుల పాటు ‘సీ విజిల్’ పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సీవిజిల్–2024 యుద్ధ విన్యాసాల్లో భాగంగా తొలిరోజున సముద్ర తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి సహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7,516.6 కిలోమీటర్ల పొడవునా సమర సన్నద్ధ ప్రదర్శన నిర్వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం, షిప్పింగ్, పెట్రోలియం, సహజ వాయువులు, కస్టమ్స్, మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. అంతర్రాష్ట్ర ఏజెన్సీల సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించి ఔరా అనిపించేలా తీర రక్షణ శక్తిని ప్రపంచానికి చెప్పారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 50 నౌకలతోపాటు 100 పెట్రోలింగ్ బోట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటుగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సబ్మైరెన్లు.. ఇలా మొత్తం 500 వరకు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. విశాఖ సహా ప్రతి తీరానికి ఐదు మైళ్ల దూరం వరకూ నిఘా వ్యవస్థను పటిష్టం చేసి మాక్ డ్రిల్ తొలి రోజున నిర్వహించారు. -
ఈ ఏడాది అనేక మైలురాళ్లు అధిగమించాం
విశాఖపట్నం పోర్టు చైర్మన్ డా.అంగముత్తు సాక్షి, విశాఖపట్నం : 2024–25 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) అనేక కీలక, ప్రత్యేక నౌకలను సమర్థవంతంగా నిర్వహించి అనేక మైలురాళ్లను అధిగమించినట్లు చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఫిబ్రవరి 21న కంటైనర్ టెర్మినల్‌లో బెర్తింగ్ చేసి.. భారీ నౌకలను సైతం అద్భుతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 29న ఎంవీ స్టార్ యాస్పిరేషన్ అనే 38 మీటర్ల బీక్ నౌకని ఇన్నర్ హార్బర్లో బెర్తింగ్ చేసి పోర్టు చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాత్రి పూట బెర్తింగ్ చేశామన్నారు. భారత నౌకాదళం కోసం హిందూస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన అతిపెద్ద ఫ్లోటింగ్ డాక్‌ని మొదటిసారిగా షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్ నుంచి షిప్‌యార్డు వెట్ బేసిన్‌కు విజయవంతంగా తరలించడం ద్వారా ఒక కీలక ఘట్టాన్ని సాధించామని పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి వేళ పూర్తిగా లోడెడ్ కేప్ నౌకలను వీజీసీబీ వద్ద తొలిసారిగా నిర్వహించామన్నారు. పోర్టు ఆధునికీకరణ పనులను కూడా విజయవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈక్క్యూ–6, డబ్ల్యూక్యూ–4,5 బెర్త్ డ్రాఫ్ట్‌ని 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు, వీసీటీపీఎల్ బెర్త్‌ని 15 నుంచి 16 మీటర్లకు పెంచినట్లు వివరించారు. పైలట్ల కొరత ఉన్నప్పటికీ అనేక నౌకలను విజయవంతంగా నిర్వహించి కీలక విజయాలను సాధించామని స్పష్టం చేశారు. -
జీతాల కోసం నినదించిన ‘ఉక్కు’ మహిళలు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జీతాల కోసం వారి కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఏడాదిగా రెండు విడతలుగా జీతాలు చెల్లించేవారు. రెండు నెలలుగా అవి కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారు. సెప్టెంబర్‌కు చెందిన సగం జీతం పెండింగ్‌లో ఉండగా.. అక్టోబర్ జీతం 65 శాతం పెండింగ్ పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున బుధవారం సాయంత్రం ఉక్కు అమరవీరుల కూడలి నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు, అక్కడి నుంచి తిరిగి అమరవీరుల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ బి.గంగారావు, సీఐటీయూ నాయకులు జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, వై.టి.దాస్‌లు మహిళల ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు పి.శిరీష, ఎన్.భారతి, ఎం.నవ్య, సుజాత, వరలక్షి, లక్ష్మి, సుభాషిణి, వేణు పాల్గొన్నారు. -
అభివృద్ధి ఆగిపోయింది
ఏడాది కాలంలో కొత్త రైళ్లేవీ రాలేదు. విశాఖ స్టేషన్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. గతంలో అనూప్‌కుమార్ సత్పత్తి డీఆర్ఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు, కొత్త రైళ్లను తీసుకురావడం వల్ల వైజాగ్ స్టేషన్‌కు ఎన్ఎస్జీ–1 గుర్తింపు వచ్చింది. సౌరభ్ వచ్చిన తర్వాత ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. అవి దువ్వాడ మీదుగానే వెళ్తున్నాయి. వీటిని వైజాగ్ తీసుకురావాలని కోరినా.. సౌరభ్ పట్టించుకోలేదు. పైగా అవినీతికి పాల్పడి సీబీఐకి చిక్కడం డివిజన్‌కు సిగ్గు చేటు. – డేనియల్ జోసఫ్, రైలు ప్రయాణికుల ప్రతినిధి -
No Headline
డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అజెండాపైనే దృష్టి సారించిన సౌరభ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ గతంలో ప్రతిపాదన చేసినవే.. ఆయన మార్కు అంటూ ఎక్కడా చూపించలేకపోయారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల విషయంలోనూ డీఆర్ఎం తన హస్తలాఘవాన్ని చూపించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన మొదలైన పనులు చేపట్టాల్సి ఉన్నా.. భారీగానే ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దువ్వాడ లాంటి స్టేషన్లో దాదాపు 50 శాతం పనులు పూర్తయినా.. వైజాగ్ రైల్వేస్టేషన్లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఉద్యోగుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 16 నెలల పాటు డీఆర్ఎంగా వెలగబెట్టిన సౌరభ్‌కుమార్.. వాల్తేరు పరువును దిగజార్చేశారు. అథఃపాతాళానికి పడిపోయిన డివిజన్‌కు కొత్త డీఆర్ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రైల్వే బోర్డు పలువురు అధికారులను సంప్రదించగా.. విముఖత చూపినట్లు సమాచారం. కాగా.. గత అనూప్ సత్పతిని మళ్లీ డీఆర్ఎంగా నియమించాలని సోషల్ మీడియా ద్వారా పలువురు రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నారు. డివిజన్ అభివృద్ధి ఎక్కడ? -
సౌరభ్ పనితీరుపై అప్పుడే అనుమానాలు
వైజాగ్ రైల్వే వ్యవస్థ పరువును సౌరభ్‌కుమార్ రోడ్డున పడేశారు. డీఆర్ఎం స్థాయి ఉన్నతాధికారి లంచాలు తీసుకోవడం నిజంగా అవమానకరం. ఆయన హయంలో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. కనీసం దానిపై సమగ్ర విచారణ కూడా చేపట్టలేదు. అప్పుడే డీఆర్ఎం పనితీరుపై అందరిలోనూ అనుమానాలు వచ్చాయి. రైళ్ల కోసం అడిగినా ఏ ఒక్కరోజూ పట్టించుకోలేదు. బ్రింగ్బ్యాక్ అనూప్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నాం. – రఘువంశీ, రైలు ప్రయాణికుల ప్రతినిధి -
అద్దె చెల్లింపులకు ప్రత్యేక అప్లికేషన్
ప్రారంభించిన వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ విశాఖ సిటీ: లీజుదారుల అద్దె చెల్లింపులను సులభతరం చేసేందుకు వీఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కోసం www. vmrdarental.com వెబ్ అప్లికేషన్‌ను రూపొందించారు. వీఎంఆర్డీఏ నుంచి లీజుకు తీసుకున్న షాపులు, వాణిజ్య సముదాయాలు, ఇలా అన్నింటికి సంబంధించిన అద్దెలను ఇకపై ఈ ప్రత్యేక అప్లికేషన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. హెచ్డీఎఫ్సీ వారు అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్‌ను వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం ప్రారంభించారు. దీంతో అద్దెదారులు తమ దుకాణాలకు సంబంధించిన నెలవారి అద్దెలను దీని ద్వారా సులభతరంగా చెల్లించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో కేవలం అద్దె చెల్లింపులకే అప్లికేషన్ అభివృద్ధి చేసినప్పటికీ దశల వారీగా ఇందులో ఇతర సేవలను నిక్షిప్తం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఆడిటోరియంల బుకింగ్‌లకు సంబంధించిన ఆప్షన్‌ను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. మరో వారం, 10 రోజుల్లో ఈ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా దశల వారీగా ఒక్కో సేవను దీని ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్, కార్యదర్శి రమేష్, ముఖ్య గణంకాధికారి హరిప్రసాద్, పరిపాలనాధికారి వెంకటేశ్వరరావు, హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అత్యాచార నిందితులకు రిమాండ్
అల్లిపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులకు వచ్చే నెల 2వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు నగర పోలీసులు తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వారు బుధవారం నిందితులను రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రే ట్ ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది. -
గంజాయి కేసులో ఫార్మాసిస్ట్‌కు బెయిల్
ఆరిలోవ: కేంద్ర కారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే ప్రయత్నంలో జైలు అధికారులకు చిక్కిన ఫార్మాసిస్ట్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కడియం శ్రీనివాస్ కేంద్ర కారాగారంలో డిప్యూటేషన్‌పై ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. విధుల నిమత్తం శ్రీనివాస్ మంగళవారం జైలుకు వచ్చాడు. జైలు ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది తనిఖీ చేయగా.. ఆయన భోజనం క్యారేజీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. జైలు అధికారుల ఫిర్యా దుతో ఆరిలోవ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి.. 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. బుధవారం అతన్ని కోర్టులో హాజరుపరచగా.. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. గంజాయి మొత్తం తక్కువగా ఉండటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఎస్ఐ కృష్ణ తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శ్రీనివాస్ వద్ద 200 గ్రాములకు పైగా గంజాయి లభించినట్లు ఆరోపిస్తున్నారు. స్టేషన్ బెయిల్ కోసం 90 గ్రాములే ఉన్నట్లు శ్రీనివాస్‌కు అనుకూలంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పోలి పాడ్యమికి ప్రత్యేక ఏర్పాట్లు
సింహాచలం: వచ్చేనెల 2న పోలి పాడ్యమిని పురస్కరించుకుని సింహగిరి దిగువ వరాహ పుష్కరిణి వద్ద దీపాలు విడిచిపెట్టేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. పుష్కరిణి నీటిలోకి ఎవరూ దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్ కూడలి నుంచి పుష్కరిణికి వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తుతో పాటు దేవస్థానం కమ్యూనిటీ గార్డులను ప్రత్యేకంగా బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ కూడలి నుంచి వరాహ పుష్కరిణి వరకు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తారని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు వేసినట్లు వివరించారు. -
పోలి పాడ్యమికి ప్రత్యేక ఏర్పాట్లు
సింహాచలం: వచ్చేనెల 2న పోలి పాడ్యమిని పురస్కరించుకుని సింహగిరి దిగువ వరాహ పుష్కరిణి వద్ద దీపాలు విడిచిపెట్టేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. పుష్కరిణి నీటిలోకి ఎవరూ దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్ కూడలి నుంచి పుష్కరిణికి వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తుతో పాటు దేవస్థానం కమ్యూనిటీ గార్డులను ప్రత్యేకంగా బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ కూడలి నుంచి వరాహ పుష్కరిణి వరకు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తారని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు వేసినట్లు వివరించారు. -
33 మంది బాల కార్మికుల గుర్తింపు
సీతంపేట: జిల్లాలో నెలరోజుల పాటు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో 33 మంది బాల కార్మికులను గుర్తించినట్టు ఉప కార్మిక కమిషనర్ ఎం.సునీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించడానికి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లో అక్టోబరు 21 నుంచి నవంబరు 20 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కనీస వేతనాల చట్టం కింద 33 కేసులు ఫైల్ చేసి.. యాజమాన్యాల నుంచి కనీస వేతనాల వ్యత్యాసాల కింద రూ.1,26,325లు జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. బాల కార్మిక చట్టం కింద 5 దుకాణాలు గుర్తించి వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసి, ఒక్కొక్క యాజమాన్యం నుంచి రూ.20 వేలు చొప్పున జరిమానాలు వసూలు చేసినట్టు తెలిపారు. బాల కార్మికుల చట్టం కింద 3 దుకాణాలపైన రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద 3 కేసులు ఫైల్ చేసినట్టు పేర్కొన్నారు. -
అగమ్యగోచరం.. గంగపుత్రుల జీవితం
● ఆదుకోని కూటమి ప్రభుత్వం ● ఒకవైపు భరోసా అందక.. మరో వైపు వరస వాయుగుండాలతో ఇక్కట్లు ● గత వైఎస్సార్ సీపీ హయాంలో మే నెలలోనే భరోసా నిధుల జమ ● నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మహారాణిపేట: రాకాసి అలలను ఎదుర్కొని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకులు ఎప్పుడే కెరటానికి ఒరిగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. కష్ట కాలంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు. ఆన్ సీజన్ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం లే దు. రాయితీ మీద ఇచ్చే ఆయిల్ సబ్సిడీ కూడా పెండింగ్‌లో ఉంది. సముద్రంలో వేట సాగిస్తున్న సమయంలో అగ్నికి ఆహుతి అయిన బోట్లకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీని కోసం మత్స్యకారులు, వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల తరచూ తుపాన్లు, వానల వల్ల సముద్రంలో వేట సాగలేదు. వేట సాగక.. పూట గడవక మత్స్యకా రులు అల్లాడుతున్నారు. ఇంకో వైపు తరచూ వాయుగుండాలు, అల్పపీడనాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంతో మేలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం సకాలంలో అందేది. ప్రతి ఏడాది మత్స్య సంపద సంరక్షణ కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అంటే 61 రోజుల పాటు సముద్రంలో వేట నిలుపుదల చేస్తారు. ఈ రెండు నెలల పాటు వేట లేకపోవడం వల్ల మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆశయంతో 2019 నుంచి 2023 వరకు అర్హులైన మత్య్సకారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇచ్చారు. 2019లో 18,925 మంది, 2020లో 20,273 మంది, 2021లో 11,193 మంది, 2022లో 11,389 మంది, 2023లో 12,173 మందికి ఈ పథకం వల్ల లబ్ధి కలిగింది. ఇప్పుడు తూట్లు.. మత్స్యకార భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అధికారం చేపట్టిన తొలి నెల్లోనే ఈ పథకాన్ని హోల్డ్‌లో పెట్టారు. నేటికి ఐదు నెలలు దాటుతున్నా అసలు ఈ పథకం ఉందో లేదో తెలియని అయోమయ స్థితిలో మత్స్యకారులు అల్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 15వ తేదీలోగానే భరోసా సొమ్ము మత్స్యకారుల చేతికి అందించేది. కానీ నేడు నవంబర్‌లోకి అడుగు పెట్టినా ఈ పథకం అమలు విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు. విశాఖ జిల్లాలో 24 కిలోమీటర్ల తీర ప్రాంతం, 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 668 మర పడవలు, 1272 మోటారు, 428 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలకు ఈ పథకం వర్తింపజేశారు. తూర్పు తీరంలో విశాఖ హార్బర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు మత్స్య సంపద పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతోంది. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తనకేం పట్టనట్లు వ్యవహరించడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
గంజాయి కేసులో ఫార్మాసిస్ట్‌కు బెయిల్
ఆరిలోవ: కేంద్ర కారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే ప్రయత్నంలో జైలు అధికారులకు చిక్కిన ఫార్మాసిస్ట్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కడియం శ్రీనివాస్ కేంద్ర కారాగారంలో డిప్యూటేషన్‌పై ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. విధుల నిమత్తం శ్రీనివాస్ మంగళవారం జైలుకు వచ్చాడు. జైలు ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది తనిఖీ చేయగా.. ఆయన భోజనం క్యారేజీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. జైలు అధికారుల ఫిర్యా దుతో ఆరిలోవ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి.. 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. బుధవారం అతన్ని కోర్టులో హాజరుపరచగా.. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. గంజాయి మొత్తం తక్కువగా ఉండటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఎస్ఐ కృష్ణ తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శ్రీనివాస్ వద్ద 200 గ్రాములకు పైగా గంజాయి లభించినట్లు ఆరోపిస్తున్నారు. స్టేషన్ బెయిల్ కోసం 90 గ్రాములే ఉన్నట్లు శ్రీనివాస్‌కు అనుకూలంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
33 మంది బాల కార్మికుల గుర్తింపు
సీతంపేట: జిల్లాలో నెలరోజుల పాటు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో 33 మంది బాల కార్మికులను గుర్తించినట్టు ఉప కార్మిక కమిషనర్ ఎం.సునీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించడానికి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లో అక్టోబరు 21 నుంచి నవంబరు 20 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కనీస వేతనాల చట్టం కింద 33 కేసులు ఫైల్ చేసి.. యాజమాన్యాల నుంచి కనీస వేతనాల వ్యత్యాసాల కింద రూ.1,26,325లు జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. బాల కార్మిక చట్టం కింద 5 దుకాణాలు గుర్తించి వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసి, ఒక్కొక్క యాజమాన్యం నుంచి రూ.20 వేలు చొప్పున జరిమానాలు వసూలు చేసినట్టు తెలిపారు. బాల కార్మికుల చట్టం కింద 3 దుకాణాలపైన రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద 3 కేసులు ఫైల్ చేసినట్టు పేర్కొన్నారు. -
నదిలో శవమైన బ్యాంక్ మేనేజర్
● కర్ణాటకలో విషాద ఘటన ● విశాఖవాసిగా సమాచారం శివమొగ్గ: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద స్థితిలో నదిలో మునిగి మరణించగా, అతని మృతదేహం తీర్థహళ్లి సమీపంలో తుంగా నదిలో లభించింది. వివరాలు.. శివమొగ్గ తాలూకాలోని అరళసురుళిలోని యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్ శ్రీవత్స (38) సోమవారం ఉదయం నది ఒడ్డున దుస్తులు, చెప్పులు, ఫోన్ వదిలి నదిలో స్నానానికి దిగినట్లు సమాచారం. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలింపు చేపట్టగా, అతని మృతదేహం బుధవారం తీర్థహళ్లి వద్ద కనిపించింది. దుస్తుల్లో లభించిన కార్డులు, మొబైల్లోని సమాచారం ఆధారంగా మృతుడిని బ్యాంక్ మేనేజర్‌గా గుర్తించారు. శ్రీవత్స ఒక్కడే తీర్థహళ్లిలో నివాసం ఉంటుండగా, కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదమా, ఆత్మహత్యా అనేది పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖలోని కుటుంబీకులకు సమాచారం అందజేశారు.